ఒక సినిమా ప్లాపయితే అందరికంటే ఎక్కువగా ఆ ప్రభావం దర్శకుడిపైనే పడుతుంది. ఒక అపజయం ఎంతటివారినైనా కోలుకోకుండా చేస్తుంది. ఇండస్ట్రీలో ఇప్పటికే ఒకసారి ఆ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న దర్శకుడు పూరి జగన్నాథ్. కెరీర్ లో మరోసారి ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నాడు. 

అందుకే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ దర్శకుడు మొత్తానికి సినిమా ద్వారా లాభాలను అందుకున్నట్లు తెలుస్తోంది. మెహబూబా సినిమాను సొంతంగా నిర్మించిన పూరి నష్టాలను చూడక తప్పలేదు. అయితే ఇస్మార్ట్ గా అలోచించి ఇప్పుడు రామ్ సినిమాతో నష్టాలను భర్తీ చేసుకుంటున్నాడు. 

ఇస్మార్ట్ శంకర్ సినిమాను 20కోట్ల లోపే ఫినిష్ చేశారు . అయితే ఆ మొత్తం థ్రియేటికల్ రైట్స్ ద్వారా వెనక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిజిటల్ - శాటిలైట్ రూపంలో పూరికి 14కోట్లు రికవర్ అయినట్లు సమాచారం. ఇక సినిమా ఏ మాత్రం క్లిక్కయినా లాభాలు మొదలవుతాయి. 

ఛార్మి కూడా ఈ సినిమాపై కొంత ఇన్వెస్ట్ చేసింది. ఆమె కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఇక రామ్ కి కూడా చాలా కాలంగా విజయాలు లేవు. హీరోయిన్స్ నిధి అగర్వాల్ - నాభ నటేష్ కూడా అవకాశాలు అందుకోవాలంటే ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలి. మరి ఇంతమంది నమ్మకాలతో ముడిపడి ఉన్న ఇస్మార్ట్ శంకర్ ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి.