టాలీవుడ్ యంగ్ హీరో రామ్, దర్శకుడు పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందని సమాచారం.

ఒక్క నాన్ థియేటర్ హక్కుల రూపంలో రూ.14 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. డిజిటల్, శాటిలైట్ హక్కులను జీటీవీకి, హిందీ డబ్బింగ్ హక్కులను మరొకరికి విక్రయించినట్లు తెలుస్తోంది. మొత్తంగా నాన్ థియేటర్ హక్కుల ద్వారా రూ.14 కోట్లు వచ్చాయట.

ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం విశేషమనే చెప్పాలి. థియేట్రికల్ రైట్స్ ద్వారా మరో ఇరవై కోట్లు వస్తుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే పది కోట్ల రేషియోలో అమ్మాలని చూస్తున్నారు.

సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ఇరవై కోట్లకు పైగా ఖర్చయిందట. ఇప్పుడు సినిమాకు జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే కచ్చితంగా లాభాలు వస్తాయని నమ్ముతున్నారు.