యువ నటుడు రామ్ పోతినేని - ఫుల్ మాస్ ఎంటర్టైనర్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకుడు పూరి ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గత కొన్ని వారాలుగా విశ్రాంతి లేకుండా కొనసాగుతున్న వీరి ప్రాజెక్ట్ ఎండింగ్ కి వచ్చేసింది. 

ఫైనల్ గా సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. మిగతా సాంగ్స్ కి సంబందించిన సీన్స్ ని కూడా పూర్తి చేస్తే సినిమా మొత్తం షూటింగ్ ముసేసినట్లే. త్వరలోనే సాంగ్ఫ్స్ చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ యూరప్ వెళ్లనుంది. ఇక సినిమాకు సంబందించిన రెగ్యులర్ ప్రమోషన్స్ ని కూడా పూరి త్వరలోనే స్టార్ట్ చేయనున్నాడు. 

మొదట ఈ నెల 15న ఇస్మార్ట్ శంకర్ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ టీజర్ పూరి స్టైల్ లో కిర్రాక్ గా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.  సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్ = నాభ నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి కూడా సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.