పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాపై ఆడియెన్స్ లో అంచనాలు బాగానే ఉన్నాయి. సినిమా ఫస్ట్ లుక్ తోనే మంచి క్రేజ్ ను తెచ్చేశారు. పక్కా హైదరాబాదీ తెలంగాణ యాసలో రామ్ క్యారెక్టర్ అందరిని ఆకట్టుకుంటుందని సమాచారం,

ఇకపోతే రీసెంట్ గా వర్కింగ్ ప్రొడ్యూసర్ ఛార్మి సినిమాకు సంబందించిన విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ నెక్స్ట్ గోవాలో 40 రోజుల వరకు మరో పెద్ద షెడ్యూల్ ని పూర్తి చేయడానికి రెడీ అవుతున్నట్లు చెప్పారు. 

అలాగే వారణాసి వంటి ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేసి కొన్ని సాంగ్స్ ల్ని ఫినిష్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు వివరించారు. ఫైనల్ గా సినిమాను మేలో విడుదల చేసేందుకు సిద్దమవుతున్నట్లు ఛార్మి వివరణ ఇచ్చారు. దీంతో మరోసారి పూరి తన సినిమాను వేగంగా ఫినిష్ చేస్తున్నాడని చెప్పవచ్చు. మరి ఇస్మార్ శంకర్ తో దర్శకుడు ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.