Bigg boss telugu season 8 : బిగ్ బాస్ లోకి వేణు స్వామిని నాగార్జున రానిస్తాడా..?
వివాదాలతో గేమ్స్ ఆడుతున్నాడు.. ప్రముఖ సినీ..రాజకీయ జ్యోతీష్కుడు వేణు స్వామి. ఆయన ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్తున్నట్టు ప్రాచారం జరిగింది. మరి ఆయన ఈ సీజన్ లో ఉన్నట్ట లేనట్టా..?
ప్రస్తుతం వివాదాలో విహారయాత్రలు చేస్తున్నాడు వేణు స్వామి. అనసరంగా లెలబ్రిటీల జీవితాల్లో వేలు పెట్టి.. నోటికి వచ్చిందల్లా వాగి ఇబ్బందులు కొనితెచ్చుకున్నాడు. అసలు ఆయన్ను వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు నెటిజన్లు... మీడియా మిత్రులు. ప్రస్తుతం టాలీవుడ్ లో వేణు స్వామి వివాడం గట్టిగా నడుస్తోంది. ఈయనకు వైసీపీ సపోర్ట్ చేస్తుండటంతో..ఈ వివాదం ఇంకాస్త పెరిగింది.
ఇక వివాదం ఇలా నడుస్తుండటంతో.. వేణుస్వామి ఓ సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారని తెలుస్తోంది. ఆయన వివాదంలో చిక్కుకుపోవడంతో బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. నిజానికి బిగ్ బాస్ కు కవాలిసింది కంట్రవర్సీ స్టార్సే.. కాని తాజాగా వివాదంలో చిక్కకున్న ఈయన ఇప్పుడు అరెస్ట్ లు లాంటివి ఎదుర్కొంటే.. హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. అది బిగ్‌బాస్ ను డిస్ట్రబ్ చేసినట్టు అవుతుంది. అదే గతంలో వివాదాలు అయితే.. అది హౌస్ కు ప్లాస్ అవుతుంది.
ఇక ఈ సీజన్ 8 మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతోంది. సెప్టెంబర్ 1 నుంచి సీజన్ 8 టెలికాస్ట్ కాబోతున్నది. ఇప్పటికే పార్టిసిపెంట్లు ఎవరన్నది నిర్వాహకులు ఫిక్స్ చేసుకున్నారు. విష్ణు ప్రియ, రీతూ చౌదరి, సోనియా సింగ్, కుమారీ ఆంటీ, హీరో రోహిత్ లాంటి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దాదాపు వీళ్లు ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఈలిస్ట్ లో గతంలో వేణుస్వామి పేరు కూడా బాగానే వినిపించింది. నిజానికి ఈయన పేరు టాప్ -5లోనే ఉందని టాక్.
అయితే దాదాపు హౌస్ లోకి వెళ్తున్నాడు అనుకున్న టైమ్ కు స్టార్ మా నిర్వాహకులు ఇప్పుడు వేణుస్వామిని తప్పించినట్టు తెలుస్తోంది. ఈ వివాదంలో తలదూర్చడంతో ఎందుకైనా మంచిదని ఆయనను తప్పించారట. వేణు స్వామిపై మహిళా కమీషన్ కు కూడా కంప్లైట్ వెళ్ళింది. సినిమా వాళ్ల జాతకాలు.. వాళ్ళు అడగకపోయినా చెప్పి సంచలనం అవుతుంటాడు వేణు స్వామి. రీసెంట్ గా నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ సమయంలో వేణుస్వామి వీరు కూడా విడాకులు తీసుకుంటారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అంతే కాదు వీరు నిశ్చితార్థం చేసుకున్న ముహూర్తం బాగాలేదని.. వారిద్దరు విడిపోతారూజజ దానికి ఓ మహిళ కారం అవుతుంది అని ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు వేణుస్వామి. అయితే బిగ్‌బాస్ హౌజ్‌లో ఇలాంటి వివాదాస్పద వ్యక్తులకే చోటు ఉంటుంది. కాని హోస్ట్ గా నాగార్జున ఉండటం.. వేణు స్వామి నాగ్ ఫ్యామిలీతోనే పెట్టుకోవడంతో.. హౌస్ నుంచి హౌట్ అయినట్టు తెలుస్తోంది.