ఫిబ్రవరి 25న వస్తున్నా అని వరుణ్ తేజ్ మంగళవారం ఉదయం ఘనంగా ట్వీట్ చేశాడు. కానీ మంగళవారం రాత్రికి ‘భీమ్లా నాయక్’ మేకర్స్ ఫిబ్రవరి 25న విడుదల అంటూ పోస్టర్ వదిలారు.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కు ఊహించని సమస్య ఎదురౌంది. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయక్ రిలీజ్ లేటు అవుతుందనే ఉద్దేశ్యంతో తమ చిత్రం ‘గని’రిలీజ్ డేట్ ఫైనల్ చేసుకుని ప్రకటించారు. ఫిబ్రవరి 25న వస్తున్నా అని వరుణ్ తేజ్ మంగళవారం ఉదయం ఘనంగా ట్వీట్ చేశాడు. కానీ మంగళవారం రాత్రికి ‘భీమ్లా నాయక్’ మేకర్స్ ఫిబ్రవరి 25న విడుదల అంటూ పోస్టర్ వదిలారు.
‘భీమ్లా నాయక్’ రాదనే ఉద్దేశంతోనే ‘గని’ డేట్ ప్రకటించారని సమాచారం. కానీ ఇప్పుడు ఇంకో డేట్ చూసుకోవాల్సిన సిట్యువేషన్. దాంతో రాజమౌళి “ఆర్ ఆర్ ఆర్” కన్నా ఎక్కువ సార్లు వాయిదా పడ్డ చిత్రం అంటూ సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ నటించిన ‘గని’సినిమాని ట్రోల్ చేస్తున్నారు. సరైన డేట్ కోసం అంటూ వెయిట్ చేస్తూ ఎప్పటికప్పుడు విడుదల తేదీ ప్రకటించడం, వాయిదా వేసుకోవడం జరుగుతోంది. ఇప్పుడు మరోసారి వాయిదా వేసుకోవాల్సిన సిట్యువేషన్.
హీరోగా, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ‘గని’ సినిమా కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. ఇందులో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ కూడా చేస్తుంది.
థియేటర్లపై సందిగ్దత నెలకొనడంతో ఇటీవల అన్ని సినిమాలు రెండు రిలీజ్ డేట్స్ ని అన్నౌన్స్ చేస్తున్నారు. ‘గని’ సినిమా కూడా గతంలో రెండు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 25 లేదా మార్చ్ 4న ఈ సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు చిత్ర యూనిట్. అయితే తాజాగా ‘గని’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 25నే ఈ సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు.
కానీ ఇప్పుడు భీమ్లా నాయక్ ట్విస్ట్ తో ...కుదిరితే మార్చి 4 లేదంటే మళ్ళీ ఎప్పుడు డేట్ దొరుకుతుందో చెప్పలేని పరిస్దితి ఏర్పడింది. మరో ప్రక్క మే 27న వరుణ్ తేజ్ నటిస్తున్న “ఎఫ్ 3” విడుదల కానుంది. సో, ఏప్రిల్ లోపు అయినా రావాలి లేదంటే ఆ జూన్ లేదా జులైలో అని ట్రేడ్ అంటోంది. చూడాలి ఏ తేదీ ఫిక్స్ చేస్తారో.
