Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి ఆకస్మిక టూర్ వెనుక అసలు కారణం అదేనా?

ఎన్నడూ లేని విధంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలో రాజమౌళి ప్రణాళిక పారడం లేదు. ఏదోఒక అవరోధంతో మూవీ షూటింగ్ సవ్యంగా సాగడం లేదు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో షూటింగ్ లేట్ అయ్యేకొద్దీ ఆర్థిక భారం ఎక్కువైపోతోంది. దీనితో నిర్మాతల నుండి ఆయనపై ఒత్తిడి అధికంగా ఉంది. రాజమౌళి సడన్ టూర్ వెనుక అసలు కారణం కూడా అదే అని తెలుస్తుంది. 
 

is this the reason behind rajamouli family karnataka tour
Author
Hyderabad, First Published Sep 18, 2020, 9:07 AM IST

దర్శకధీరుడు రాజమౌళి భార్య రమాతో కలిసి కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ సందర్శించారు. అక్కడ సరదాగా వైల్డ్ లైఫ్ టూర్ కి వెళ్లడం జరిగింది. బందిపూర్ ఫారెస్ట్ లో  తిరుగుతూ అక్కడ వైల్డ్ లైఫ్ ని ఎంజాయ్ చేశారు. అలాగే సమీపంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించడంతో పాటు, ప్రత్యేక పూజలు జరిపారు. వీరి టూరు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. 

రాజమౌళి ఈ ఆకస్మిక టూర్ వెనుక అసలుకారణం ఒత్తిడే అని ప్రచారం జరుగుతుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలో రాజమౌళి తీవ్ర ఆలోచనకు లోనవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలో ఆయన ప్రణాళిక పారడం లేదు. ఏదోఒక అవరోధం వలన మూవీ షూటింగ్ సవ్యంగా సాగడం లేదు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో షూటింగ్ లేట్ అయ్యేకొద్దీ ఆర్థిక భారం ఎక్కువైపోతోంది. దీనితో నిర్మాతల నుండి ఆయనపై ఒత్తిడి అధికంగా ఉంది. 

మరో వైపు చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం రాజమౌళి త్వరగా ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. అందుబాటులో ఉన్న వనరులు, కోవిడ్ ఆంక్షల మధ్య షూటింగ్ జరపడానికి రాజమౌళి ఇష్టపడం లేదు. క్వాలిటీ విషయంలో కాంప్రమైస్ కానీ రాజమౌళికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో మానసిక ప్రశాంత కోసం రాజమౌళి సతీసమేతంగా ఈ టూర్ వేశారని సమాచారం. ఇక దసరా తరువాత ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని టాలీవుడ్ టాక్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios