సోనూసూద్ కు వేషాలు లేకుండా చేయటానికే ఈ ప్రచారం?

ఇవన్నీ సోనూసూద్ మీద ఓ వర్గం కావాలని చేస్తున్న రూమర్స్ అంటున్నారు. ఆయనకు హీరో ఇమేజ్ వచ్చేసరికి తట్టుకోలేక ఇలా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అలాగే ఆయనకు వేషాలు రాకుండా చేయటానికే ఓ వర్గం పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం అని ఫిల్మా్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.  అయితే అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

Is Sonu Sood demanding Rs 4 Crore? jsp

లాక్‌డౌన్  టైమ్ లో వేలాది కార్మికులకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు  సోనూసూద్. ఆయన చేసిన సేవలకు దేశమంతా ప్రశంసలతో ముంచెత్తింది. అందరూ ఆయన గురించే మాట్లాడుతున్నారు.  అతడికి భారీగా ఫాలోయింగ్ పెరిగింది. ఈ నేపధ్యంలో ఆయనకు డిమాండ్ రెట్టింపు అయ్యింది. ఈ నేపధ్యంలో చాలామంది దర్శక నిర్మాతలు సోనూని తమ సినిమాల్లో నటించాలని సంప్రదిస్తున్నారు. అయితే ఆయన చెప్పే రెమ్యునేషన్ విని వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

సాధారణంగా ఒకటిన్నర నుంచి రెండు కోట్లు దాకా సినిమాకు తీసుకునే సోనూసూద్..మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల దాకా రెమ్యునేషన్ అడుగుతున్నట్లు సమాచారం. అయితే విలన్ కు అంత ఇచ్చి పెట్టుకునే నిర్మాత ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్దకంగా మారింది. ఈ మధ్యన తెలుగులో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేసిన ఓ సీనియర్ స్టార్ ఆయన డేట్స్ కోసం ట్రై చేసారట. రేటు తగ్గించుకుంటారేమో చూసారట. కానీ అలా జరగకపోవటంతో సోనూ సూద్ ని ప్రక్కన పెట్టారట. అయితే ఇవన్నీ సోనూసూద్ మీద ఓ వర్గం కావాలని చేస్తున్న రూమర్స్ అంటున్నారు. ఆయనకు హీరో ఇమేజ్ వచ్చేసరికి తట్టుకోలేక ఇలా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అలాగే ఆయనకు వేషాలు రాకుండా చేయటానికే ఓ వర్గం పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం అని ఫిల్మా్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.  అయితే అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 
 
ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర కోసం సోనూసూద్‌ను సంప్రదించారు. అయితే ఆయన చెప్పిన రెమ్యునరేషన్ కు  బోయపాటి వద్దనుకున్నారని వదంతలు వ్యాపించాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios