నాగ్ నటించిన 'మన్మధుడు 2' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఎంత స్పీడుగా వచ్చిందో ..అంతే స్పీడుగా భాక్స్ లు సర్దే పరిస్దితి తెచ్చుకుంది. సినిమా విడుదలకు ముందు నుంచీ విమర్శల్ని ఎదుర్కొన్న ఈ సినిమా అడల్ట్‌ కంటెంట్‌ తో అడ్డంగా దొరికిపోయింది. డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, జుగుప్సాకరమైన సీన్స్  ఈ సినిమాని ఫ్యామిలీలకు దూరంగా పెట్టేసాయి. అలాగని..యూత్ కు దగ్గరకాలేకపోయింది. సర్లే ఇదంతా రిలీజ్ అయ్యాక అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ విషయం సమంత ముందే పసిగట్టేసిందా అంటే అవుననే అనాల్సి వస్తోంది.

వాస్తవానికి  'మన్మధుడు 2'లో అక్కినేని వారి కోడలు సమంత గెస్ట్‌ రోల్‌ పోషించింది. అయితే,   ట్రైలర్స్‌లో ఆమె పాత్రను సస్పెన్స్‌గా ఉంచారు,రివీల్ చేసారు. కానీ, ప్రమోషన్స్‌లో ఒక్కసారి అయినా సమంత పాల్గొవాలి. పోనీ సమంత చేసింది అని రివీల్ అయిపోతే కథ ఏమన్నా దెబ్బ తింటుందా అంటే అంత సీన్ లేదు. కానీ చిత్రంగా ఈ సినిమాకు మొదటనుంచీ సమంత దూరంగా ఉండిపోయింది. తన కుటంబ సినిమానే కదా అని ..కనీసం   ఒక్క ట్వీట్‌ కూడా వెయ్యిలేదు.

కేవలం నాగార్జున తన మామగారనే కాదు.. సినిమా టీమ్ లో ఉన్న హీరోయిన్ రకుల్, దర్శకుడు రాహుల్, ఆయన భార్య చిన్మయి అంతా ఫ్రెండ్సే. అయినా సమంత కావాలనే ఇగ్నోర్ చేసిందని ఇప్పుడు అర్దమవుతోంది. అంటే ఆమె ఈ సినిమాకు ఇలాంటి పరిస్దితి వస్తుందని ఊహించిందన్నమాట. పొరపాటున తను కనుక  ప్రమోట్ చేస్తే తర్వాత ఓ రేంజిలో ట్రోలింగ్ కు గురి అవుతానని కూడా అర్దం చేసుకుని ఉంటుంది. అలా సమంత ఈ విషయంలో తన తెలివిని ప్రదర్శించి..దూరంగా ఉండిపోయింది. నాగ్ కే ఆ విషయం రిలీజయ్యే దాకా అర్దమయ్యినట్లు లేదు.