1995లో వచ్చిన రంగీలా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్ లో సుస్దిర స్దానం ఏర్పాటు చేసిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమాతో ఊర్మిళ పెద్ద స్టార్ అయ్యిపోయింది. అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరో ఉన్నా ఈ సినిమాలో ఊర్మలే హైలెట్ అయ్యింది. ఆమె హాట్ ఫెరఫార్మెన్స్ కు బాలీవుడ్ దాసోహం అనేసింది. అలాంటి రంగీళా సినిమాకు సీక్వెల్ ప్లానింగ్ ఉందా అంటే రామ్ గోపాల్ వర్మ అవును అంటారు.

గత కొద్ది రోజులుగా ఆయన రంగీళా సినిమాను ఈ కాలానికి తగినట్లు మార్చి సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన తన రైటర్స్ తో డిస్కస్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మరి ఈ సారి ఊర్మిళలా నటించేది ఎవరు..ఆ రంగీళా ఎవరు అనేది మొదట ప్రశ్న. ఆ రంగీళా మరెవరో కాదు...నిధి అగర్వాల్ అని చెప్తున్నారు. 

రామ్ గోపాల్ వర్మ చిత్రాల్లో తనకు రంగీళా ఇష్టమని చెప్పిన ఆమెతోనే వర్మ ఆ సీక్వెల్ సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం నిధి అగర్వాల్ ...పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అయ్యింది. రామ్, పూరి కెరీర్ లు ఈ సినిమా హిట్ పై ఆధారపడి ఉన్నాయనటంలో సందేహం లేదు.