వివాదం, శృంగారమే ప్రధానాంశాలుగా సినిమాలు తెరకెక్కిస్తున్న రామ్ గోపాల్ వర్మ డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు. ఆయన తెరకెక్కించిన న్యూడ్, క్లైమాక్స్, పవర్ స్టార్ చిత్రాలు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. ఇటీవల విడుదలైన థ్రిల్లర్ మూవీకి మాత్రం పెద్దగా ఆదరణ దక్కలేదని టాక్. ఇక ఆయన తెరకెక్కిస్తున్న మర్డర్ మూవీపై అమృత న్యాయపోరాటం మొదలుపెట్టగా, ఆ మూవీ ఆగిపోయినట్లే అంటున్నారు. కాగా ఇటీవల వర్మ 'అల్లు' అనే ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి అల్లు అని పేరు పెట్టడం వెనుక కారణం...ఈ చిత్రంలోని పాత్ర ఎప్పుడూ ఐడియాలు అల్లుతూ ఉంటాడు అని వర్మ వివరణ ఇచ్చారు. 

చాలా కాలంగా వర్మ పవన్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారు. పవర్ స్టార్ మూవీలో ఒక వైపు పవన్ ని అభాసుపాలు చేస్తూనే, మరో వైపు మీకు తిరుగులేదని ఎలివేట్ చేశారు. అల్లు మూవీ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించే అని అందరికీ అర్థం అయ్యింది. పవర్ స్టార్ మూవీ విషయంలో అల్లు అరవింద్ వర్మను తీవ్రంగా విమర్శించారు. అందుకే వర్మ అల్లు అరవింద్ ని టార్గెట్ చేశారని అందరు అనుకున్నారు. 

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక విషయంలో అల్లు అరవింద్ కీలక పాత్ర పోషించారని వినికిడి. ఈ నేపథ్యంలో ఆ కోణంలో అల్లు అరవింద్ ని టార్గెట్ చేసి సినిమా తీస్తారని అందరూ భావించారు. కాగా అల్లు మూవీ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎటువంటి అప్డేట్ లేని పక్షంలో వర్మ ఈ విషయంలో వెనక్కి తగ్గాడని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై కిద్దిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కలదు.