ఇప్పుడు స్టార్‌ హీరోలు ఇద్దరు ముగ్గురు దర్శకులను లైన్‌లో పెడుతున్నాడు. మినిమమ్‌ మూడు సినిమాలు లైన్‌లో ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవి సైతం దాదాపు మూడు సినిమాలు లైన్‌లో పెట్టారు. చెర్రీ మాత్రం తదుపరి సినిమా ఏదో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 

ఆయన ప్రస్తుతం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో నటిస్తున్నాడు. దీంతోపాటు `ఆచార్య`లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక హీరోగా ఆయన నెక్ట్స్ సినిమా ఏంటనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి. కానీ కొరటాల..తన తదుపరి సినిమాని అల్లు అర్జున్‌తో ప్రకటించారు. దీంతో కొరటాలతో సినిమా లేనట్టే అనే విషయం కన్ఫమ్‌ అయ్యింది. 

అయితే మహేష్‌ హ్యాండివ్వడంతో వంశీపైడిపల్లి.. రామ్‌చరణ్‌ని అప్రోచ్‌ అయ్యారని వార్తలొచ్చాయి. మరి ఈ సినిమా ఉంటుందా? లేదా అనేదానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు `భీష్మ` సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న వెంకీ కుడుముల కూడా రామ్‌చరణ్‌కి కథ చెప్పాడని, ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫమ్‌ అని తెలుస్తుంది. చెర్రీ తన నెక్ట్స్ సినిమాగా వెంకీ కుడుమలతో చేసే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్‌లో టాక్‌. మరి ఇందులో నిజమెంతా? అనేది చూడాలి.