ఈ  చిత్రానికి ప్ర‌శాంత్ నీల్‌ (Prashanth Neel) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.  అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ విషయం అంతగా చర్చగా మారింది.

క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ (Yash)హీరోగా చేస్తున్న చిత్రం కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2 (KGF chapter 2). పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్‌ (Prashanth Neel) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ విషయం అంతగా చర్చగా మారింది. అదేమిటంటే....

ఈ సినిమాకు ఖచ్చితంగా మంచి ఓపినింగ్స్ ఉంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మొదటి మూడు రోజులు ఆర్.ఆర్.ఆర్ లాగ టిక్కెట్ రేట్లు పెంచితే మాత్రం దెబ్బ పడుతుందని ట్రేడ్ లో హెచ్చరికలు చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ కు ఎన్టీఆర్, రామ్ చరణ్,రాజమౌళి అనే మూడు శక్తులు పనిచేయటం, అది డైరక్ట్ తెలుగు సినిమా కావటంతో ఎంత రేటు టిక్కెట్ పెట్టినా కలిసొచ్చింది. అయితే కేజీఎఫ్ 2 విషయానికి వస్తే అది ఎంతకాదనుకున్నా డబ్బింగ్ సినిమానే. మన హీరో కాదు. ఫస్ట్ పార్ట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కాబట్టి ఎక్కువ టిక్కెట్ రేట్లు పెడితే వర్కవుట్ కావటం కష్టమంటున్నారు.గవర్నమెంట్ ఫర్మిషన్ ఇచ్చినా గతంలో మాదిరి రేట్లు నే తెలంగాణాలో ఎంచుకుంటే బెస్ట్ అని సలహా ఇస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ధరల విషయంలో సినిమా నిర్మాత ఇష్టానికి వదిలేసాయి. దీంతో విడుదల రోజు మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ ధర అధికారికంగా 400 నుంచి 450 రూపాయలకు చేరుకుంది. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవే స్థాయి రేట్లు కొనసాగాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి "ప్రత్యేక మినహాయింపు" ఇచ్చామని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకొచ్చాయి. అయితే అదే స్ట్రాటజీ మాత్రం కేజీఎఫ్ 2 కు కలిసి రాదు అనేది నిజం.

తెలంగాణలో సినిమాకు సింగిల్ స్క్రీన్ లో 175 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 290 రూపాయలు గరిష్ట ధర గా ఉంచాలి. ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్స్ కు 145 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 177 రూపాయల గరిష్ట ధర అమలు చేయాలి. రీక్లెయినర్ సీట్లు వీటికి మినహాయింపు. అప్పుడే ఆక్యుపెన్సీ నిలబడుతుంది. మరీ ముఖ్యంగా మీడియం రేట్లు వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఈ సినిమా చూడ్డానికి ఆసక్తి చూపిస్తారు.

ఇక ‘కేజీఎఫ్‌’కు ప్రీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమైంది. ఈ చిత్రానికి ప్రశాంత్‌నీల్‌ (Prasanth Neel) దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) ఈ చిత్రంలో విలన్ గా కనిపించనున్నారు. ‘అధీరా’ పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని అలరించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, టాలీవుడ్‌ నటుడు రావు రమేష్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు.