Asianet News TeluguAsianet News Telugu

#Hanuman కు బ్లాక్ మెయిల్..నిజమా,ఎవరు చేస్తున్నారు?

అందరి ప్రెజర్ హనుమాన్ మీదనే, ఈ బడా ప్రొడ్యూసర్స్ అందరి టార్గెట్ తేజ సజ్జానే ....

Is evaryone pressure on Prasanth Varma Hanuman movie jsp
Author
First Published Dec 25, 2023, 7:54 AM IST


సలార్ కూడా రిలీజైపోయింది. ఇంక పెద్ద సినిమాలంటే సంక్రాంతికే. మధ్యలో ఒకటీ అరా వచ్చినా పెద్ద పట్టింపు కాదు. దాంతో 2024 సంక్రాంతికు పోటీ ఓ రేంజిలో ఉంది. సంక్రాంతి రిలీజ్ కోసం  తెలుగు స్టార్ హీరోలంతా తమ సినిమాలతో ఆల్రెడీ కర్ఛీప్ వేసేసారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం”, విక్టరీ వెంకటేష్ “సైంధవ్”, రవితేజ లేటెస్ట్ మూవీ “ఈగల్”, కింగ్ నాగార్జున “నా సామి రంగ”, తేజ సజ్జ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “హనుమాన్” వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి. అయితే బయ్యర్లు మాత్రం గోలెత్తిపోతున్నారు. మరో ప్రక్క థియేటర్స్ సమస్య వస్తుంది. నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. అయితే అందరూ హనుమాన్ చిత్రాన్ని చిన్న సినిమాగా భావించి ప్రక్కకు వెళ్లమంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

  ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దిల్ రాజు సంక్రాంతికి విడుదల కానున్న సినిమాల సమస్య పరిష్కారానికి నిర్మాతలతో శుక్రవారం ఫిలిం ఛాంబర్ లో సమావేశం అయ్యారు. సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ పరిస్థితి వల్ల ఎవరూ పెద్దగా లాభపడే అవకాశం లేదు కాబట్టి, కొన్ని సినిమాలను వాయిదా వేస్తే బెటర్ అనే ఆలోచనతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ   మీటింగ్ కు “గుంటూరు కారం” ప్రొడ్యూసర్ నాగ వంశీ, “ఈగల్” కో ప్రొడ్యూసర్ టిజి విశ్వప్రసాద్, “నా సామిరంగా” నిర్మాత చిట్టూరి శ్రీను, “సైంధవ్” మూవీ ప్రొడ్యూసర్ వెంకట్ బోయనపల్లి హాజరయ్యారు. కానీ “హనుమాన్” ప్రొడ్యూసర్ మాత్రం ఈ మీటింగ్ కు రాలేదు. “హనుమాన్” నిర్మాత ప్రస్తుతం సిటీలో లేకపోవడంతో రాలేకపోయారని అన్నారు. ఆయనపై ప్రెజర్ పెడతారనే కావాలనే ప్రక్కకు తప్పుకున్నాడని అంటున్నారు. 

ఏదైమైనా సంక్రాంతి బరి  హనుమాన్ నిర్మాత మాత్రం వెనక్కి తగ్గదేలేదని  క్లియర్ గా చెప్పారట. ఆ నిర్మాతకి ఫోన్ చేసి సినిమా వాయిదా వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని, థియేటర్స్ దొరక్కుండా చేస్తామని బ్లాక్ మైల్ కాల్స్ చేస్తున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయినా తగ్గేదేలే అంటున్నారట. ఎందుకంటే హిందీ బిజినెస్ బాగా జరిగిందని, అక్కడ రిలీజ్ డేట్ మళ్లీ దొరకదని కాబట్టి ఎట్టి పరిస్దితుల్లోనూ   హనుమాన్ ని సంక్రాంతి తీసుకురావడానికి నిర్మాత పట్టుదలతో వున్నారని తెలుస్తోంది. అందరికీ తమ సినిమా రిలీజే కావాలి. ఎవరూ రేస్ నుంచి డ్రాప్ అవ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. మొత్తానికి అందరి ప్రెజర్ హనుమాన్ మీదనే, ఈ బడా ప్రొడ్యూసర్స్ అందరి టార్గెట్ తేజ సజ్జానే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios