ఎన్టీఆర్ స్థానంలో అల్లు అర్జున్. బిజీ షెడ్యూల్ లో తారక్ నాని ,బన్నీ వైపే మొగ్గుచూపుతన్న మా టీవి యాజమాన్యం
దక్షిణాదిలో బిగ్‌బాస్ రియాలిటీ షో లేటుగా స్టార్ట్ అయినా గానీ దానికి వచ్చిన స్పందన అనూహ్యం. తొలి సీజన్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో రెండో సీజన్‌కు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా దుమ్ము దులిపేశారు. సీజన్ 2కి ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంపై సందేహలు నెలకొన్నాయి. తెలుగులో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించినందుకు జూనియర్ ఎన్టీఆర్‌కు భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం. ప్రతీ ఎపిసోడ్‌కు యంగ్‌టైగర్‌కు రూ.35 లక్షల చొప్పున చెల్లించినట్టు వార్తలు వచ్చాయి. అయితే కొత్త ప్రాజెక్టుల కారణంగా బిగ్‌బాస్ రియాలిటీషోకు ఎన్టీఆర్ దూరమవుతున్నట్టు సమాచారం.

జై లవకుశ సక్సెస్ తర్వాత తదుపరి చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత వెంటనే అంటే అక్టోబర్ నెల నుంచి దర్శకుడు రాజమౌళి రూపొందించే మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రాజెక్టుల ఒత్తిడి కారణంగా బిగ్‌బాస్ రియాలిటీ షో చేయడానికి ఎన్టీఆర్ సుముఖంగా లేనందున ప్రస్తుతం నిర్వాహకులు అల్లు అర్జున్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ అంశంపై అటు ఎన్టీఆర్ సైడ్ నుంచి గానీ, ఇటు అల్లు అర్జున్ ఎలాంటి స్పందన గానీ, ప్రకటన గానీ రాకపోవడంతో ఈ వార్తలో వాస్తవం ఎంత అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతున్నది.

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో విషయంలో ఎన్టీఆర్ తన ప్రతిభతో కొత్త ప్రమాణాలు సెట్ చేశాడన్నది వాస్తవం. ఒకవేళ నిజంగా ఎన్టీఆర్ చేయకపోతే టెలివిజన్ ప్రేక్షకులకు కొంత నిరాశే. అయితే అల్లు అర్జున్ హోస్ట్‌గా ఎలా వ్యవహరిస్తాడో చూడాలి. ఎన్టీఆర్ లోటును తన యాక్టివ్‌నెస్‌తో పూడ్చడం సాధ్యమవుతుందా లేదా అనే ఆలోచనలలో యాజమాన్యం ఉన్నట్టు సమాచారం.

మరో వైపు నాని పేరు కూడా ఎక్కవగా వినిపిస్తోంది.
