బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ మరోసారి తల్లికాబోతున్నారా..? అనే ప్రశ్న సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. ఇటీవల బీచ్ లో ఆమె దిగిన ఫోటో చూసిన అభిమానులు ఐశ్వర్య మరోసారి తల్లి కాబోతుందంటూ ప్రచారం చేస్తున్నారు.

ఇటీవల ఐశ్వర్య తన భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యతో కలిసి గోవాకి వెళ్లారు. అక్కడ ఐశ్వర్య, అభిషేక్ బీచ్ లో నడుస్తుండగా.. అక్కడి మీడియా వర్గాలు ఫోటోలు తీశాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి కారణం ఫోటోలో ఐశ్వర్యరాయ్ ఉదరభాగం కాస్త లావుగా కనిపించడమే.

దీంతో ఆమె మళ్లీ తల్లి కాబోతున్నారా..? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ విషయంపై స్పందించిన ఐశ్వర్య మేనేజర్.. కెమెరా యాంగిల్ సరిగ్గా లేకపోవడం వలన ఫోటో అలా వచ్చి ఉంటుందని, ఐశ్వర్య ప్రేగ్నంట్ కాదని వివరణ ఇచ్చారు.

అంతేకాదు.. ఇలాంటి ఫోటోలు ఆధారంగా వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.