ఆ అగ్రనటుడు ఎక్కువ కాలం బ్రతికి ఉండరట!

Irrfan Khan finally speaks up about his health
Highlights

ఆయన బయటకు బాగానే కనిపిస్తున్నా.. క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉండడం అందరినీ బాధించింది. చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు

ఎలాంటి పాత్రైనా.. తన నటనతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసే అతి తక్కువ మంది నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తుంటే.. మరొకరిపై ప్రేక్షకుల దృష్టి మర్లదు. అంతగా ఆడియన్స్ ను తన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేస్తాడు. అటువంటి నటుడికి క్యాన్సర్ సోకిందనే విషయం తెలియగానే అభిమానులతో పాటు ఇండస్ట్రీలో వారు షాక్ కి గురయ్యారు. ఆయన బయటకు బాగానే కనిపిస్తున్నా.. క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉండడం అందరినీ బాధించింది.

చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కానీ ఇర్ఫాన్ మాత్రం ఎక్కువ కాలం బ్రతికి ఉండడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం అందరికంట కన్నీరు తెప్పిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇర్ఫాన్.. కొంతకాలంగా ఎండో క్రిన్ ట్యూమర్ క్యాన్సర్ తో బాధ పడుతున్నట్లు.. ప్రస్తుతం లండన్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు చెప్పారు. తనకు సోకిన క్యాన్సర్ కు ఆరు దశల్లో కీమో థెరపీ చేయాలని, ఇప్పటికి నాలుగు సైకిల్స్ పూర్తయ్యాయని, మరో రెండు మిగిలి ఉన్నట్లు చెప్పారు.

అవి పూర్తయిన తరువాత తనకు తెలిసినంత వరకు కొద్ది నెలలు మహా అయితే సంవత్సరం కాలం బ్రతికి ఉంటానని లేదంటే మరో రెండేళ్లు మాత్రమే.. తాను జీవించి ఉంటానని చెప్పారు. ఈ విషయాన్ని తన మనసులో నుండి తీసేయాలని అనుకుంటున్నట్లు, ఉన్నంతకాలం సంతోషంగా ఉంటానని అన్నారు. ఆయన నోటి నుండి ఇటువంటి మాటలు విన్న వారందరూ ఈ చేదు నిజాన్ని భరించలేక ఎమోషనల్ అవుతున్నారు.  

loader