Asianet News TeluguAsianet News Telugu

హాట్ హాట్ సీన్లతో ట్రైలర్ వేడిక్కించేసారే

ఆర్గానిక్ పీస్ లాగా ఉన్నావ్.. ఫ్లాట్ కోస్తావా? .. అంటూ డైలాగులుతో ,హాట్ హాట్ లిప్ లాక్ సీన్స్ తో ట్రైలర్ ని వదిలారు. 

Ippudu kakapothe inkeppudu movie trailer released jsp
Author
Hyderabad, First Published Jul 29, 2021, 10:57 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


కొత్త హీరో,హీరోయిన్ తో రొమాంటిక్ సినిమాలు చేస్తే వర్కవుట్ అవుతుందని చాలా మంది నిర్మాతలు నమ్ముతున్నారు. అది కొన్ని సార్లు నిజం కూడా. ప్రమోషన్స్ కూడా ఆ ఉద్దేశాన్ని హైలెట్ చేస్తూ చేస్తున్నారు. తాజాగా నూతన నటుడు హస్వంత్ వంగా హీరోగా నమ్రత దారేఖర్, కతల్యాన్ గౌడ హీరోయిన్స్ గా చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వై.యుగంధర్ దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త చింతా గోపాలకృష్ణ రెడ్డి (గోపి) నిర్మించిన రొమాంటిక్ రామ్ కమ్ ఫిల్మ్ "ఇప్పుడు కాక ఇంకెప్పుడు". ఆగస్టు 6న రిలీజ్ కానున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.  ఈ ట్రైలర్ హాట్ హాట్ గా రొమాంటిక్ సినిమా అని చెప్పకనే చెప్తోంది. ముఖ్యంగా హీరోయిన్ తో సీన్స్ జనాలకి బాగా నచ్చుతున్నాయి. ఆ ట్రైలర్  పై మీరూ ఓ లుక్కేయండి. 

నటుడు అప్పాజీ అంబరీష్ మాట్లాడుతూ... '  ఈ సినిమా సక్సెస్ అయి యుగంధర్ మంచి డైరెక్టర్ గా ఇండస్ట్రీలో నిలబడాలి.. అలాగే మా నిర్మాత గోపీ గారికి కాసుల వర్షం కురిపించాలని కోరుకుంటున్నాను.. అన్నారు. నటి నోమిన తార మాట్లాడుతూ.. ఈ చిత్రంలో లిటిల్ క్యూట్ గా వుండే ఒక ముఖ్యమైన పాత్రలో నటించాను. అది చూస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఫిల్మ్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సీనేంక్ మంచి హిట్ అవ్వాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత దర్శకులకు నా థాంక్స్.. అన్నారు. 

 
చిత్ర నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ' బేసిగ్గా నేను వ్యాపారవేత్తను.. మా సినిమా టైటిల్ లాగానే ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా తీయాలని అనుకునేవాడ్ని.. యుగంధర్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. సంవత్సరానికి రెండు సినిమాలు తీసి కొత్త టాలెంట్ ని మా బ్యానర్ ద్వారా ఎంకరేజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందరూ శ్రీ చక్రాస్ బ్యానర్ ద్వారా మాకు లైఫ్ వచ్చింది అనుకునేలా సినిమాలు చేయాలని నాకొరిక.  యుగంధర్ మంచి సినిమా చేశాడు..   సినిమా కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.. అన్నారు. 

 హీరో హస్వంత్ వంగా మాట్లాడుతూ.. మా పేరెంట్స్ అబ్రాడ్ లో వున్నా కూడా ఆవేలితి తెలియనీయకుండా మా అత్తామామలు నన్ను బాగా చూసుకున్నారు. ఇంజినీరింగ్ కంప్లీట్ అయ్యాక సినిమాలు చేస్తాను అంటే  బాగా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీకి  థాంక్స్. యుగంధర్ కథ చెప్పింది చెప్పినట్టుగా తీశాడు. గోపీ గారు ఎక్కడా రాజీ పడకుండా ఎక్స్ ట్రార్డినరిగా సినిమా తీశారు. సాహిత్యా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జెమిన్ బ్యూటిఫుల్ విజువల్స్ తో సినిమాని కలర్ ఫుల్ గా చిత్రికరించారు. స్క్రీన్ మీద నన్ను నేను చూసుకొని చాలా థ్రిల్ ఫీలయ్యాను. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతీ ఆర్టిస్టు, టెక్నీషియన్స్ అందరికీ నా థాంక్స్.. అన్నారు. 

చిత్ర దర్శకుడు వై. యుగంధర్ మాట్లాడుతూ.. ' రామ్ కమ్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. ఏసినిమాకైనా కథే హీరో.. దాంతోపాటు నిర్మాతే ఎప్పటికీ హీరో అని నేను బలంగా నమ్ముతాను..మా సినిమాకి మా నిర్మాత గోపాలకృష్ణ రెడ్డిగారి హీరో. నేను ఆయనకి కథ చెప్పాక.. చాలా బాగుంది.. నువ్ బాగా చేస్తావ్ అని నమ్మకంవుంది.. నువ్ దైర్యంగా చేయి నీ వెనుక నేనుంటాను అని ఈ సినిమా చేశారు. ఓటీటీలు వచ్చినా కూడా మన సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేద్దాం అని వెయిట్ చేసి ఆగస్టు 6న లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నేను నమ్మి పెట్టుకున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి ఈ చిత్రానికి వర్క్ చేశారు. ఖచ్చితంగా షూర్ షాట్ హిట్ కొడుతున్నాం అని కాన్ఫిడెన్స్ గా ఉన్నాం.. అన్నారు. 

హస్వంత్ వంగా, నమ్రత దారేఖర్ కతల్యాన్ గౌడ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో  తనికెళ్ళ భరణి, తులసి, రాజా రవీంద్ర, పూజ రామచంద్రన్, ఐడ్రీమ్ అంజలి, అప్పాజీ అంబరీష్, రాజా శ్రీధర్, జబర్దస్త్ రాఘవ, రాయ్ సింగ్ రాజు, వశిష్ఠ చౌదరి, నోమినా తార, నిఖిల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ; జెమిన్ జామ్ అయ్యనేత్, మ్యూజిక్; సాహిత్యా సాగర్, ఎడిటర్; శ్రీకాంత్ పట్నాయక్ ఆర్, కోరియోగ్రఫి; శ్రీ క్రిష్, లిరిక్స్; సాహిత్యా సాగర్, సురేష్ బానిశెట్టి, ఆర్ట్; బాబా అర్మోన్, పీఆర్ఓ; వంశీ-శేఖర్, నిర్మాత; చింతా గోపాలకృష్ణ రెడ్డి, రచన- దర్శకత్వం; వై. యుగంధర్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios