ఈ చిత్రానికి ‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితేఆ టైటిల్ కాదని ఇప్పుడు వేరే టైటిల్ వినపడుతోంది.
పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ‘వినోదయ సీతం’ చిత్రం రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఈమెకు ను ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ‘వినోదయ సీతమ్’ చిత్రం తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ తెలుగు నేటివిటీకి తగినట్టు చాలా మార్పులు చేసి రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తుండడం విశేషం.
జూలై 28 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టైటిల్ ఏం పెట్టబోతున్నారనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది.
ఈ చిత్రానికి ‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితేఆ టైటిల్ కాదని ఇప్పుడు వేరే టైటిల్ వినపడుతోంది. అది దైవం మనుష్య రూపేణా. సంస్కృత వాక్యమైన ఈ టైటిల్ కనుక ఫిక్స్ చేస్తే.. వినడానికి, చెప్పుకోడానికి బాగానే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఈ వాక్యం చాలా పాపులర్. ఇక ఈ సినిమా టైటిల్ ఏంటనేది అఫీషియల్ గా ఇంకా రివీల్ చెయ్యలేదు. త్వరలో దాని పై అప్డేట్ రానుంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది 'వినోదయ సీతమ్' సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు.. సాయి ధరమ్ తేజ్ అనుకోకుండా ఒక యాక్సిడెంట్ కి గురయ్యి ప్రాణం కోలుపోతాడు. అప్పుడు అతని దగ్గరికి టైం అనే వ్యక్తి (పవన్ కళ్యాణ్) వచ్చి భూమి పై నీ సమయం అయ్యిపోయింది అని, తనతో రావాలని చెబుతాడు. అయితే సాయి ధరమ్ తాను చేయవల్సిన కొన్ని పనులు ఉన్నాయి అని, తనకి ఒక మూడు నెలలు సమయం కావాలని పవన్ ని అడుగుతాడు. ఆ సమయాన్ని పవన్ ఇవ్వడమే కాకుండా, ఆ 3 నెలలు సాయి ధరమ్ తో కలిసి ప్రయాణిస్తాడు. ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగిలిన కథ.
