అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకేక్కిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో నాగార్జున డాన్ తరహా పాత్రలో కనిపిస్తుండగా, నాని డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

అయితే ఈ సినిమాకు టైటిల్ గా 'దేవదాసు' అనే పేరుని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏఎన్నార్ నటించిన 'దేవదాసు' ఓ ప్రేమ కావ్యమైతే ఈ దేవదాసు కామిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సినిమాలో నాగార్జున పాత్ర పేరు దేవ కాగా నాని క్యారెక్టర్ పేరు దాసు అట. దీంతో టైటిల్ గా వీరిద్దరి పేర్లు కలిసోచ్చేలా.. 'దేవదాసు' అనే పేరుని ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఇదే విషయాన్ని  అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆకాంక్ష సింగ్, రష్మిక మందనాలు కనిపించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.