ఆర్య, అతడు, జల్సా, ఆగడు వంటి ఎన్నో సూపర్ హిట్  మూవీల‌కు సినిమాటోగ్రాప‌ర్ గా పనిచేసిన గుహన్ దర్శకుడుగా మారాడు.నందమూరి కళ్యాణ్ రామ్ 16వ చిత్రంతో ఆయన మెగాఫోన్ పట్టుకున్నాడు. ఆ చత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. . 2019 ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నారు. 

ఈ నేఫద్యంలో ఈ చిత్రం ఏమి పెట్టాలనేది గత కొద్దికాలంగా చిత్రం టీమ్ రకరకాల టైటిల్స్ అనుకుంటోంది. అయితే తాజాగా ఆ ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి ఒక నెంబర్ ను టైటిల్ గా ఖరారు చేయాలని డిసైడ్ అయ్యారట. సినిమా కథలో ‘118’ అనే నెంబర్ కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి దాన్నే టైటిల్ గా పెడితే బాగుంటుందని భావిస్తున్నారు. అతి త్వరలోనే ఈ టైటిల్ ప్రకటన జరిగే అవకాసం ఉంది. 

ఇక తన తండ్రి  నంద‌మూరి హ‌రికృష్ణ మృతితో కొన్నాళ్ళు షూటింగ్‌కి దూరంగా ఉన్న క‌ళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్టుని మొదలెట్టారు. న‌టుడిగా, నిర్మాత‌గా హిట్, ప్లాఫ్ లు పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ రీసెంట్‌గా నా నువ్వే అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.   జయేంద్ర దర్శకత్వంలో నా నువ్వే రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందింది. తమన్నా హీరోయిన్ గా నటించిన‌ ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. 

దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కళ్యాణ్ రామ్ కసిగా ఈ చిత్రం చేస్తున్నట్లు టీమ్ చెపోతంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలిని పాండే నటిస్తున్నారు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు