పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మల్టిపుల్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. పవన్ అయితే అందంగా రాజకీయాలతో బిజీగా ఉంటూ ఏపీ పాలిటిక్స్ లో కాక పుట్టిస్తున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మల్టిపుల్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. పవన్ అయితే అందంగా రాజకీయాలతో బిజీగా ఉంటూ ఏపీ పాలిటిక్స్ లో కాక పుట్టిస్తున్నాయి. ఇలాంటప్పుడు కమిటైన అన్ని చిత్రాలకు డేట్స్ కేటాయించడం కత్తిమీద సాము లాంటింది. 

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ఓజి, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. బ్రో ఎలాగూ షూటింగ్ పూర్తి చేసుకుని జూలై చివరి వారంలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ప్రభాస్ అయితే సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. 

పవన్ పాలిటిక్స్, బిజీ షెడ్యూల్ కారణంగా వరుసగా ఒకే చిత్రానికి డేట్స్ కేటాయించడం కష్టం. అయినప్పటికీ సుజీత్ మెరుపు వేగంతో ఓజి షూటింగ్ ని 50 శాతం ఫినిష్ చేశాడు. ఇప్పుడు పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పవన్ అందుబాటులో లేని సమయంలో కూడా సుజీత్ తగ్గేదే లే అంటున్నాడట. పవన్ లేకపోయినా ఓజి షూటింగ్ జరుగుతూనే ఉంది. అదెలా అంటే ఈ చిత్రంలో కీలక పాత్రలు చాలా ఉన్నాయి. దీనితో సుజీత్.. పవన్ తో ప్రమేయం లేని సన్నివేశాలని చిత్రీకరిస్తున్నాడట. 

Scroll to load tweet…

డైరెక్టర్ మారుతి కూడానా అంతే.. ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్ తో బిజీగా ఉన్నప్పుడు రాజా డీలక్స్ చిత్రంలోని ఇతర సన్నివేశాలని షూటింగ్ జరుపుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు టాప్ హీరోల చిత్రాలకు ఇది గమ్మత్తైన సిట్యువేషన్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా డివివి ఎంటర్టైన్మెంట్స్ ఓజి షూటింగ్ 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది.