పవన్ కళ్యాణ్ రీమేక్ లకు స్వస్తి చెప్పాలని కోరుతున్నారు. కానీ పవన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
రానా దగ్గుబాటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తోంది. మలయాళీ చిత్రం అయ్యప్పనుమ్ కోషియం చిత్రానికి ఇది రీమేక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథని తెలుగు నేటివిటీకి అనుగుణంగా, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా మార్చారు. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటెర్టైనెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా దూసుకుపోతోంది.
చూస్తుంటే సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ గ్యాప్ తీసుకునేలా లేరు. తాజా సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతం అనే చిత్ర రీమేక్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు వరుస రీమేక్స్ తో విసిగిపోయారు.
మళ్ళీ మరో రీమేక్.. అందులోను వినోదయ సీతం అనే సాఫ్ట్ సినిమా కావడంతో అభిమానులు ససేమిరా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ రీమేక్ లకు స్వస్తి చెప్పాలని కోరుతున్నారు. కానీ పవన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అతిత్వరలో ఈ చిత్రం అధికారికంగా లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మాటలు అందించబోతున్నట్లు టాక్.
ఒక వైపు ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నా పవన్ వెనక్కి తగ్గక పోవడానికి కారణం ఉందని అంటున్నారు. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కేటాయించింది కేవలం 20 రోజుల కాల్ షీట్స్ మాత్రమే. ఈ మూవీలో మరో కీలక పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించబోతున్నాడు. పవన్ పాత్ర 20 రోజుల్లోపే పూర్తి కానుంది.
కేవలం 20 రోజులకు పవన్ కళ్యాణ్ రూ 50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం. ఇది షాకింగ్ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. నిర్మాతలు పోటీ పడి మరీ ఈ స్థాయిలో పవన్ కి రెమ్యునరేషన్ అందిస్తున్నారు. వకీల్ సాబ్ చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన కాల్ షీట్స్ 50 నుంచి 60 రోజులు మాత్రమే. ఆ చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారు.
వినోదయ సీతం రీమేక్ లో పవన్ నటించవద్దని ఫ్యాన్స్ అంటున్నారు. మరికొందరు అభిమానుల వాదన మాత్రం మరోలా ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు పవన్ కళ్యాణ్ వీలైనన్ని ఎక్కువ చిత్రాల్లో నటించాలని ప్రయత్నిస్తున్నారు. తద్వారా రాజా జనసేన పార్టీ ఖర్చులకి గాను ఎక్కువ ధనం సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. స్ట్రైట్ సినిమాలు చేస్తే సమయం ఎక్కువ అవుతుంది. అదే రిమేక్ అయితే తక్కువ టైం లోనే పూర్తి చేయొచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ వీలైనంత వరకు రీమేక్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని అంటున్నారు.
