సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. కేజిఎఫ్ చిత్రంలో అతడి టేకింగ్ కు అంతా ఫిదా అయ్యారు. హీరో యష్ క్రేజ్ మరింతగా పెరిగిందంటే అది ప్రశాంత్ నీల్ వల్లే. అంతలా ఈ చిత్రంలో హీరో పాత్రలో ప్రశాంత్ నీల్ హైలైట్ చేశాడు. కేజీఎఫ్ చిత్రం విడుదలైనప్పటి నుంచి ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం ఏంటనే చర్చ ఆసక్తికరంగా మారుతోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. 

ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ తెలుగు హీరోతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ప్రశాంత్ నీల్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కొందరు తెలుగు బడా నిర్మాతలు ప్రశాంత్ నీల్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. త్వరలో ప్రశాంత్ నీల్ తెలుగులో ఓ చిత్రం చేయబోతున్న సంగతి నేడు ఖరారైంది. 

మంగళవారం రోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మైత్రి మూవీస్ సంస్థ ప్రశాంత్ నీల్ కు బర్త్ డే విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మా సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు. దీనితో మైత్రి మూవీస్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ ఓ చిత్రం చేయబోతున్నాడనే విషయం అర్థం అవుతోంది. 

నెటిజన్లంతా ప్రశాంత్ నీల్ తెలుగు సినిమాలో హీరో ఎవరు అంటూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. కేజీఎఫ్ విడుదలైన సందర్భంలో ప్రభాస్ చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించాడు. దీనితో ప్రభాస్ తో సినిమా ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. అదే విధంగా మహేష్ బాబు, రాంచరణ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.