అఖిల్ నటించిన ఫస్ట్ మూవీ అఖిల్. ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా అంచనాలు అందుకోలేకపోయాయి. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. గీతాఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. 

ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఎంచుకోగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. అఖిల్ కన్నా మూడేళ్లు పెద్దదైన పూజా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండడంతో అభిమానులు ఈ చిత్రం గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు 

తాజాగా సినిమాపై ఉత్కంఠని పెంచే మరో అంశం బయటకు వచింది. బొమ్మరిల్లు భాస్కర్ ప్రస్తుతం అఖిల్, పూజా హెగ్డేలపై కోర్టు సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నాడట. సినిమాలో అత్యంత కీలకమైన ఈ ఎపిసోడ్ ఆసక్తిని రేపుతోంది. ఇతర నటీనటులు కూడా ఈ సన్నివేశం షూటింగ్ లో పాల్గొంటున్నారు. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.