Asianet News TeluguAsianet News Telugu

హిందీలో ఇంట్రెస్టింగ్ గా ‘లైగర్’ వసూళ్లు.. ఆశ్చర్యకరంగా మూడో రోజు కలెక్షన్స్.!

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘లైగర్’ డిజాస్టార్ టాక్ తెచ్చుకున్నా.. వసూళ్లలో మాత్రం పర్లేదనిపిస్తోంది. ముఖ్యంగా హిందీలో ఈ మూవీ కలెక్షన్స్ షాకింగ్ గా ఉన్నాయి. 
 

Interesting collection of Liger Movie in Hindi, This is surprising.!
Author
First Published Aug 28, 2022, 12:02 PM IST

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో వచ్చిన స్పోర్ట్స్ అండ్ యాక్షన్ ఫిల్మ్  ‘లైగర్’. ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చిన ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తొలిరోజే డిజాస్టార్ టాక్ తెచ్చుకుని Liger ఫ్యాన్స్ ను అప్సెట్ చేసింది. అయితే సినిమా రివ్యూస్ ఎలాగున్న కలెక్షన్స్ లో మాత్రం పర్లేదనిపిస్తోంది. ఓవర్సీస్, తెలుగు స్టేట్స్ విషయం అటుంచితే హిందీలో మాత్రం ఈ మూవీకి మంచి కలెక్షన్సే వస్తున్నాయి. తొలిరోజుతో పోల్చితే మూడోరోజు కూడా స్టడీగా వసూళ్లు చేస్తుండటం ఆశ్చర్యకరంగా మారింది. 

ఒక్కరోజు ఆలస్యంగా హిందీలో ‘లైగర్’ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అప్పటికే డిజాస్టార్ టాక్ ను అందుకున్న ఈ చిత్రానికి నార్త్ ఆడియెన్స్ మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు ఆగస్టు 26న ఈ మూవీ రూ. 1.25 కోట్లు నెట్ వసూళ్లు చేసింది. ఓపెనింగ్ డే శుక్రవారం రూ.4.5 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి రూ. 5.75 కోట్లు రాబట్టింది. అయితే ఈ కలెక్షన్స్ తో ‘లైగర్’ బాహుబలి హిందీ ఓపెనింగ్ డే రికార్డునుబ్రేక్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మూడో రోజు కలెక్షన్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. 

మూడో రోజు ఈ చిత్రం అదే స్థాయిలో కలెక్షన్లను రాబడుతుండటం ఆచ్చర్యకరంగా ఉంది. శనివారం ఒక్కరోజే హిందీలో ఈ మూవీ రూ.4.10 కోట్ల నుంచి రూ.4.50 కోట్ల వరకు సాధించింది. మొత్తం వరల్డ్ వైడ్ రూ.10.25 కోట్లు వచ్చినట్టు బాలీవుడ్ మీడియా వెల్లడిస్తోంది. ప్రస్తుతం ఇదే పంథాను కొనసాగిస్తోంది. అయినా ఈ చిత్రానికి తెలుగు స్టేట్స్ లో నష్టాలు తప్పవని అంచనాలు ఉన్నప్పటికీ.. హిందీలో మాత్రం కాస్తా ఊరటనిస్తోందనే చెప్పాలి. కానీ ఆదివారం (ఈరోజు) భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉండటం ఈ మూవీకి మైనస్ గా మారిందంటున్నారు. ఏదేమైనా విజయ్ దేవరకొండ సినిమా హిందీ వెర్షన్ దాదాపు 25 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios