మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం రేపు శుక్రవారం నుంచి థియేటర్స్ లో సందడి చేయనుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం రేపు శుక్రవారం నుంచి థియేటర్స్ లో సందడి చేయనుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా అలరించనుంది.
అలాగే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రం వారం గ్యాప్ లో ఆగష్టు 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ తెరకెక్కిన హైయెస్ట్ బడ్జెట్ చిత్రం ఇది. రవితేజ రామారావు చిత్రానికి.. కళ్యాణ్ రామ్ బింబిసారకి మధ్య ఒక పోలిక ఉంది. రామారావు చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నారు.. బింబిసారలో కళ్యాణ్ రామ్ మహారాజుగా నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలకి పోలిక ఏంటి అనుకుంటున్నారా.. ఐతే ఇది తెలుసుకోవాల్సిందే.
రామారావు ఆన్ డ్యూటీ చిత్ర రన్ టైం 146 నిమిషాలు. ఈ చిత్రానికి ఏమాత్రం సంబంధం లేని బింబిసార రన్ కూడా 146 నిమిషాలే. వారం గ్యాప్ లో విడుదలవుతున్న ఈ రెండు చిత్రాల రన్ టైం భలే కుదరడంతో సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రవితేజ, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కుమ్మక్కయ్యారా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
రవితేజ ఈ చిత్రంలో డిప్యూటీ కలెక్టర్ గా మాఫియా బెండు తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా తన పరాక్రమం చూపించబోతున్నాడు. కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో తొలిసారి ప్రయత్నిస్తున్న జోనర్ ఇది. మరి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
