బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) రీసెంట్ గా తన ఇంటిని విక్రయించారు. అయితే ఆ ఫ్లాట్ ను ఇన్ స్టాగ్రామ్ స్టార్ కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  

సెలబ్రెటీల ఇల్లు అంటే ఎంత విలాసవంతంగా ఉంటాయో తెలిసిందే. ప్రధాన నగరాల్లో స్టార్ హీరోలు, హీరోయిన్లు తరుచుగా ఫ్లాట్స్ కొంటూ.. అమ్ముతూ ఉంటారు. రీసెంట్ గానే రన్బీర్ కపూర్ తన ముంబైలోని తన రెండు ప్లాట్లను విక్రయించారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముంబైలోని కోట్లు విలువ చేసే తన ఫ్లాట్ ను విక్రయించారు. దాన్ని కోట్లు చెల్లించి ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కొనుక్కోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గ్గా మారింది. 

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చాందినీ బాబ్దా (Chandni Bhabhda) ముంబైలో తన మొదటి ఇంటిని కొనుగోలు చేశారు. 24 ఏళ్లు చాందిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. దీంతో అక్షయ్ కుమార్ నుంచి ఈ ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. అయితే 25 ఏళ్లలోపే ఇంటిని కొనుగోలు చేయాలని భావించిందంట.. ఈ మేరకు ఈఎంఐలో తాజా ఇంటిని కొన్నదని తెలిపింది. ఇక అక్షయ్ కుమార్ నుంచి ఆ ఫ్లాట్ ను రూ.6 కోట్లకు సొంతం చేసుకుంది. 

అయితే.... అక్షయ్ కుమార్ 2017లో అంధేరీలోని ట్రాన్స్‌కాన్ ట్రయంఫ్ - టవర్ 1లో నాలుగు అపార్ట్ మెంట్లను కొన్నారు. ఒక్కొక్కటి 2,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగింటిని సొంతం చేసుకున్నారు. 38 అంతస్తులైన ఆ రెసిడెన్షియల్‌లో నాలుగు ఫ్లాట్లు 21వ అంతస్తులో ఉన్నాయి. ఇప్పటికే అందులోని ఒక అపార్ట్‌మెంట్‌ ను సంగీత దర్శకుడు దబూ మాలిక్‌కు గతేడాది విక్రయించారు. ఇప్పుడు చాందినీ బాబ్దాకు మరో ఫ్లాట్ ను అమ్మారు.

ఇక చాందినీ బాబ్దా విషయానికొస్తే... తను మిమిక్రీలో ఎక్స్ పర్ట్. తదర్వా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 4.6 లక్షలకుపై ఫాలోవర్స్ ఉన్నారు. తరుచూ వీడియోలు, రీల్స్, ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఆకట్టుకుంటూ ఉంటారు.

View post on Instagram