శ్రీకారం ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న యువకుడు మరణించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వేడుకలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ చిరు అభిమాని రెండు రోజులు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచాడు. వివరాలలోకి వెళితే హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ శ్రీకారం. శివరాత్రి కానుకగా రేపు విడుదల కానుంది. 


ఈ నేపథ్యంలో సోమవారం ఖమ్మంలో శ్రీకారం ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. శ్రీకారం ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావడం జరిగింది. ఆయన రాకను తెలుసుకున్న అభిమానులు వేల సంఖ్యలో వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు వేదికైన మమతా హాస్పిటల్స్ గ్రౌండ్స్ చిరంజీవి అభిమానులతో కిక్కిరిసిపోయింది.

 
చిరంజీవి ని చూసే క్రమంలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఖమ్మంకి చెందిన శివ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా నేడు మరణించాడు. స్థానికంగా శివ వంట మాస్టర్ గా పనిచేస్తాడని సమాచారం.