ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్ర మానియా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. వరల్డ్ వైడ్ గా ఉన్న సెలెబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు సైతం చిత్రంలోని పాటలకు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్ర మానియా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. వరల్డ్ వైడ్ గా ఉన్న సెలెబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు సైతం చిత్రంలోని పాటలకు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప మొదటి భాగం మంచి విజయం సాధించింది. సెకండ్ పార్ట్ కి కావలసిన పబ్లిసిటీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అనే చెప్పాలి. 

ఈ చిత్రంలోని 'సామీ సామి', శ్రీవల్లి, ఊ అంటావా మావ సాంగ్ సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా చాలా మంది సినీ అభిమానులు పుష్ప చిత్రంలోని స్టెప్పులు, డైలాగులని అనుకరిస్తున్నారు. వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

ఇప్పటికే డేవిడ్ వార్నర్, బ్రేవో, హార్దిక్ పాండ్య లాంటి సెలెబ్రిటీలు పుష్ప చిత్రంలోని పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో సందడి చేశారు. సర్ప్రైజింగ్ గా ఓ ఎయిర్ హోస్టెస్ పుష్ప చిత్రంలోని సామీ సామీ సాంగ్ కి డాన్స్ చేసింది. అలాఇలా కాదు కుర్రాళ్ళ మతిపోగోట్టే విధంగా డాన్స్ చేసింది. ఆ ఎయిర్ హోస్టెస్ ఎవరో కాదు.. కొన్ని నెలల క్రితం 'మానికే మాగే' అనే శ్రీలంక సాంగ్ కి డాన్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆయత్. 

View post on Instagram

తెల్ల పట్టు చీర ధరించి అందంగా ముస్తాబైన ఆమె మతిపోగోట్టే విధంగా సామీ సామీ సాంగ్ కి డాన్స్ చేసింది. మునిపంటితో పెదవులు కొరుకుతూ, నడుము, నాభి అందాలు ప్రదర్శిస్తూ ఆయత్ డాన్స్ చేసిన విధానం అదుర్స్. ఆ వీడియోని ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. నెటిజన్లని విశేషంగా ఆమె డాన్స్ ఆట్టుకుంటోంది. 

View post on Instagram

ఈ సాంగ్ కి పెర్ఫామ్ చేయమని చాలా రిక్వస్ట్ లు వచ్చాయి. అందుకోసమే చేస్తున్నా అంటూ ఆయత్ కామెంట్ పెట్టింది. అందాల దేవతలా మెరిసిపోతున్న ఆయత్ సామీ సామీ సాంగ్ లో హుక్ స్టెప్పు వేస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు. అంతలా మెస్మరైజ్ చేస్తోంది. ఆలాగే శ్రీవల్లి సాంగ్ కి హావభావాలు ఇస్తూ మరో వీడియో కూడా చేసింది. 

పుష్ప చిత్రంలో రష్మిక మందన అందాలు ఆరబోస్తూ అద్భుతంగా డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ చెప్పులు ఈడ్చుకుంటూ వేసిన హుక్ స్టెప్ కూడా సెన్సేషన్ గా మారిపోయింది. ప్రస్తుతం అభిమానులంతా పుష్ప పార్ట్ 2 ఎలా ఉంటుందో అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.