మొదటి సారి అఫీషియల్ గా తెరపైకి ప్రభుదేవ రెండో భార్య.. స్టార్ కొరియోగ్రఫర్ ను విష్ చేసిన హిమాని
ఇండియన్ మల్టీ స్టార్ గా అన్ని భాషల్లో తన సత్తా చాటుకున్నారు ప్రభుదేవ. పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ లో.. చాలా కాంట్రవర్సీలు ఫేస్ చేశాడు.
ఇండియన్ డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా... ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ఆయన.. మల్టీ టాలెంటెడ్ స్టార్ గా ఎదిగారు. అన్ని భాషల్లో ప్రభుదేవ తన ప్రభావం చూపించారు. కొరియోగ్రఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. స్టార్ డాన్సర్ గా.. హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలు చేశారు. తండ్రి సుందరం మాస్టారు వారసత్వాన్ని తీసుకుని సినీ పరిశ్రమలోకి వచ్చిన ప్రభుదేవా..సౌత్ లోనే కాకుండా..బాలీవుడ్ లో కూడా స్టార్ గా ఎదిగారు. ఇక ఆయన ఇంత సాధించినా.. తన ఫ్యామిలీ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసిన ఆయన.. ఎన్నో అవమానాలు కూడా పడ్డారు. నయనతారతో డేటింగ్ వ్యవహారం, మొదటి భార్య నుంచి అనేక ఆరోపణలు, కుమారుడిని కోల్పోవడంతో పాటు నయనతారతో డేటింగ్ లాంటివి ఆయన జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి.
ఇక ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఆయన జీవితాన్ని కుదిపేశాయి. అయితే అనూహ్యంగా మరో పెళ్లి చేసుకుని అప్పట్లో వార్తల్లో నిలిచారు. అయితే రెండో భార్యకుసబంధించి ఇంత వరకూ ఆయన ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఆమె ఫోటోలు కూడా అఫీషియల్ గా బయట పెట్టలేదు. కాని తాజాగా మొదటి సారి ఆమె స్క్రీన్ పై మెరిసింది.
కెరీర్ లో నిలబడుతున్న టైమ్ లో .. రమాలత అనే ఆమెతో ప్రభుదేవకు వివాహం జరిగింది . వీరికి ముగ్గురు పిల్లలు కాగా, కుమారుడు విశాల్ 13 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో మరణించారు. ఆతరువాత స్టార్ గా మారుతున్నక్రమంలో.. హీరోయిన్ నయనతారతో ప్రేమలో పడ్డాడు. వీరు పెళ్ళి కూడా చేసుకుంటాడు అనుకున్న టైమ్ లో .. మొదటి భార్య రమ నుంచి ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. అయితే 2011లో వీరు విడాకులు తీసుకున్నారు. ఇక ఆయన నయనతారను పెళ్లాడటం ఖాయం అనుకుంటుండగా.. సడెన్ గా.. అనూహ్యా పరిణామాల మధ్య వీరు విడిపోయారు.
2020లో ప్రభుదేవా ముంబైకి చెందిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ హిమానిని పెళ్లి చేసుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంలో ఇద్దరు ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే వీరు సహజీవనం మాత్రమే చేస్తున్నారన్నమాట కూడా వినిపించింది. ఒసందర్భంతాలో ప్రభుదేవకు ట్రీట్మెంట్ ఇస్తూ.. వీరు ప్రేమలో పడ్డట్టు సమాచారం. కాని ఎప్పుడూ వీరు తమ మధ్య సంబంధాన్ని బహిర్గతం చేయలేదు ఈ జంట. కాగా, ఇప్పటి వరకు ఈ జంట బహిరంగంగా కనిపించిందీ లేదు.
అయితే తాజాగా ఆయన 50వ పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా అతడికి విషెస్ చేస్తూ ఆమె తొలిసారిగా మీడియా కంటికి కనిపించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. మీతో మూడేళ్ల ప్రయాణం..అద్భుతమైన జర్నీ. మీరు ఎంతో జాయ్ ఫుల్ పర్సన్.నిన్ను పెళ్లి చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా అంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. దాంతో వీరి బంధం అఫీషియల్ గా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తో పాటు..న్యూస్ కూడా వైరల్ అవుతోంది.