ఇప్పుడు ఇండియన్‌ ఫిల్మ్ క్రిటిక్‌గా గా పాపులర్‌ అయిన రాజీవ్‌ మసంద్‌ కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆయన టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది.

కరోనా కారణంగా అనేక మంది సినీ సెలబ్రిటీలు ఆసుపత్రుల పాలవుతున్నారు. వారిలో కొందరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతూ తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నారు. ఇప్పుడు ఇండియన్‌ ఫిల్మ్ క్రిటిక్‌గా గా పాపులర్‌ అయిన రాజీవ్‌ మసంద్‌ కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆయన టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. అయితే ఆక్సిజన్‌ లెవల్స్ పడిపోవడంతో తాజాగా ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పై ఆయనకు ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగానే ఉందని సమాచారం. 

దీనిపై ధర్మ ప్రొడక్షన్‌ స్క్రిప్ట్ హెడ్‌ సోమన్‌ మిశ్రా స్పందించారు. ఆయన పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని, కానీ వెంటిలేటర్‌పై ఉన్నారనే వార్తల్లో నిజం లేదన్నారు. ల్మ్ క్రిటిక్‌గా, రైటర్‌గా, సీనియర్‌ జర్నలిస్ట్ గా రాజీవ్‌ మసంద్‌ రాణిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో అమీర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ వంటి వారు కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇటు తెలుగులోనూ చాలా మంది స్టార్స్ కరోనాతో పోరాడుతున్నారు.

Scroll to load tweet…