శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో గాని సినిమాకు సంబందించిన విషయాలు మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. శంకర్ సినిమాకు ఊహించని ఇబ్బందులు ఎదురవుతుండడంతో అసలు సినిమాను పూర్తి చేస్తాడా చేయడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. 

లైకా ప్రొడక్షన్ శంకర్ అన్ లిమిటెడ్ బడ్జెట్ కి ఎలాగోలా బ్రేకులు వేసి సినిమాను స్టార్ట్ చేసింది. ఆరు నెలల కిందట మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి 15 శాతం మాత్రమే పూర్తయినట్లు తెలుస్తోంది. అసలైతే మధ్యలో సినిమా ఆగిపోకుంటే ఇప్పటికి సగం షూటింగ్ అయిపోయి ఉండేది. అయితే మరోసారి ఇలా షూటింగ్ కి బ్రేకులు పడకుండా శంకర్ రీ షెడ్యూల్ ని స్ట్రాంగ్ గా సెట్ చేసుకున్నాడు. 

అలాగే రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 2021 మార్చ్ 14న ఎలాగైనా సినిమాను విడుదల చేయాలనీ నిర్మాతల వద్ద అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడట. ఆ మార్చ్ తమిళులకు నూతన సంవత్సరం కావడంతో ఆ ఫెస్టివల్ లోనే సినిమాను రిలీజ్ చేయాలనీ షూటింగ్ ని వచ్చే ఏడాది ఎండింగ్ లోనే పూర్తి చేయాలనీ శంకర్ డిసైడ్ అయినట్లు సమాచారం.