Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss6: ఇనయాను పిట్ట అన్న శ్రీహాన్.. హౌస్ అంతా రచ్చరచ్చ చేసిన సుల్తాన, ఫైమాపై పగతీర్చుకున్న రేవంత్

బిగ్ బాస్ హౌస్ లో అదే రచ్చ కొనసాగుతుంది. కాసేపు స్నేహంగా ఉన్నవాళ్ళే.. అంతలోనే శత్రువులుగా మారిపోతున్నారు. ఇక 17వ రోజు, 18వ రోజు బిగ్ బాస్ లో వరుసగా గొడవలతో పాటు కాస్త ఫన్నీ మూమెంట్స్ కూడా చోటు చేసుకున్నాయి. మరి ఏం జరిగిందో చూద్దాం.

Inaya Sultana fired on Sreen Han in the Bigg Boss house
Author
First Published Sep 22, 2022, 11:07 PM IST

ఈ ఎపిసోడ్ తో అడవి టాస్క్ అయిపోయింది.. అయితే ఈ టాస్క్ లో.. పోలీస్ టీమ్ గెలిచింది. బంగారు కొబ్బరి బోండం ఉండటం వల్ల శ్రీ సత్య కెప్టెన్సి పోటీదారు అయ్యింద. గీతు తో పాటు సభ్యులు ఎంచుకున్న శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమా కూడా కెప్టెన్సీ కోసం పోటీ కిసెలక్ట్ అయ్యారు. ఇక ఈ టాక్స్ ముగిసే టైమ్ లో నేహా రేవంత్ కు లూజర్ గా అవ్వద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే హౌస్అంతా అంత రచ్చ  చేసినా.. ఇనయాను బాగా ఆడినట్టు అందరూ మెచ్చుకున్నారు. 

ఇక ఈ టాక్స్ కంప్లీట్ అవ్వగానే ..కెప్టెన్సీకి పెటీపడుతున్న ఐదుగురుతో పాటు.. సంచాలకుడిగా రేవంత్ ఎంపిక అయ్యాడు. గేమ్ ఆడుతున్న సమయంలో గీతు ఫస్ట్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవ్వగా.. ఆతరువాత గేమ్ రూల్స్ ను పాటించలేదని ఫైమాను కూడా గేమ్ నుంచి తప్పించాడు రేవంత్. ఈ విషయరంలో ఫైమా గట్టిగానే ఫైట్ చేసింది. కాని లాభం లేకుండా పోయింది. ఫైనల్ గాఫైమాను గేమ్ నుంచి ఎలిమినేట్ చేశాడు రేవంత్. 

ఈ క్రమంలోనే ఫైమాకు సపోర్ట్ గావచ్చిన ఇనయా.. శ్రీహాన్ కూడా గేమ్ ల పోరపాటు చేశాడంటూ ఆరోపించింది. గట్టీగా అరుస్తూ.. హౌస్ అంతా రచ్చ చేుసింది. దాంతో శ్రీహాన్ కూడా డిఫెన్స్ చేసుకుంటూ.. ఇనయాకు పోటీ ఇవ్వాలని చూశాడు. ఈక్రమంలోనే ఇనయాను పిట్టతో పోలుస్తూ జోక్ చేశాడు. దాంతో ఇనయాకు కోపం కట్టలు తెంచుకుంది. హౌస్ అంతా పరిగెడుతూ.. బిగ్గరగా అరుస్తూ.. శ్రీహాన్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది.  ఈ క్రమంలోనే శ్రీహాన్ ను సేవ్ చేస్తూ.. గీతు కామెడీగా ఇనయాను అడ్డుకునే ప్రయత్నం చేసింది. 

ఇక అడవి  గేమ్ తో పాటు.. కెప్టెన్సీ పోటీపై కూడా హౌస్ అంతా రచ్చ రచ్చ జరిగింది. ఎవరికి వారు చర్చలు మొదలు పెట్టారు. ఇక ఎప్పటిలాగానే అసలు విషయాలు మర్చిపోయి.. నాగార్జున చెప్పిన విషయాలు అసలే మర్చిపోయి.. రేవంత్ రెచ్చిపోవడం మొదలు పెట్టాడు. సుదీపా ఏదో అంది అని అన్నం తినడం మానేసి.. హౌస్ లో ఉన్న వాళ్లతో వాదనకు దిగాడు. తాను కెప్టెన్ అయ్యాక కిచెన్ టీమ్ అందరిని పక్కకు నెట్టేస్తానన్నాడు.  ఇక్కడ కాస్త ఫన్ జనరేట్ అవ్వగా.. మరోసారి డైనింగ్ దగ్గర రాజ్ జోకులతో సందడి చేశాడు. 

కెప్టెన్ రాజ్ తను అస్సలు పెళ్ళి చేసుకోవద్దు అనుకున్నానని..కాని హౌస్ లోకి వచ్చిన తరువాత ఇక్కడ కపుల్స్ ను చూసి తాను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నట్టు చెప్పాడు. దాంతో అక్కడ ఉన్న బ్యాచిలర్ లేడీస్ తో కలిసి కెప్టెన్ రాజ్ ను లింక్ చేస్తూ.. జోకులు పేల్చారు హౌస్ మెంట్స్. ముఖ్యంగా నేహా రాజ్ ను ఒక ఆట ఆడకుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో హౌస్ కు కెప్టెన్ ఎవరో తెలుస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios