Asianet News TeluguAsianet News Telugu

ఆసుపత్రిలో చేరిన సంగీత దర్శకుడు.. ఇప్పుడెలా ఉందంటే!

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు గుండెనొప్పితో.. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ హాస్పటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. హాస్పటిల్ లో చేరేటప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.  టెస్ట్ లు చేసి వెంటనే గుండెకు స్టంట్స్ వేసారు. దాంతో అభిమానులు ఆయన హెల్త్ పరిస్దితి ఎలా ఉందని కంగారుపడుతున్నారు. ఈ నేపధ్యంలో  ఆయన స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఈ నెల 4న ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఈ రోజు (మంగళవారం) డిశ్చార్చ్ అవుతున్నారు. 
 
Im doing fine after heart operation: Music Director Sashi Preetham
Author
Hyderabad, First Published Jun 9, 2020, 1:48 PM IST

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు గుండెనొప్పితో.. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ హాస్పటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. హాస్పటిల్ లో చేరేటప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.  టెస్ట్ లు చేసి వెంటనే గుండెకు స్టంట్స్ వేసారు. దాంతో అభిమానులు ఆయన హెల్త్ పరిస్దితి ఎలా ఉందని కంగారుపడుతున్నారు. ఈ నేపధ్యంలో  ఆయన స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఈ నెల 4న ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఈ రోజు (మంగళవారం) డిశ్చార్చ్ అవుతున్నారు. 

సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ మాట్లాడుతూ "ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనెల 4వ తేదీ ఉదయం నాకు గుండెపోటు వచ్చింది. వెంటనే నా మిత్రుడు రాజు గారు బంజారాహిల్స్ సెంచరీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. హార్ట్ లో బ్లాక్ ఉందని యాంజియోప్లాస్టి చేశారు. ఒక స్టంట్ వేశారు. మాసివ్ హార్ట్ ఎటాక్ నుండి నన్ను సేవ్ చేశారు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అందరికీ పేరుపేరునా థాంక్స్" అని అన్నారు. 

డాక్టర్ అమీనుద్దిన్ ఒవైసీ మాట్లాడుతూ ‌"సెంచరీ హాస్పిటల్ లో శశి ప్రీతమ్ కన్సల్టెంట్ డాక్టర్ నేనే. జూన్ 4న ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయన మా దగ్గరికి వచ్చారు. హార్ట్ ఎటాక్ అని గ్రహించాను. యాంజియోగ్రామ్ చేసి, తర్వాత స్టంట్ వేశాం. ‌ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఐసీయూలో 24 గంటల్లో అబ్జర్వేషన్ లో ఉంచాము. ఆయన చాలా త్వరగా కోలుకున్నారు. ఇప్పుడు ఆయన వాకింగ్ కూడా చేస్తున్నారు. ఆయనకు ఇతర సమస్యలు ఏవీ లేవు. ఇతర వ్యాధి లక్షణాలు కూడా కనిపించలేదు" అని అన్నారు.

జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబీ సినిమాతో ఆయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 21 తెలుగు సినిమాలతో హిందీ సినిమాలకు కూడా సంగీతం అందించారు. డాక్యుమెంటరీలు, యాడ్స్, సీరియల్స్ కూడా శశి ప్రీతమ్ పని చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios