తెలుగు డైరక్టర్ ఇలియానాపై లైంగిక వేధింపులు?ఎవరతను
ఇలియానాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రామ్ తో చేసిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఇలియానా.తెలుగుతో పాటుగా తమిళ సినిమాల్లో కూడా నటించిన ఈ గోవా బ్యూటీ అక్కడ కూడా దుమ్ము రేపింది.తెలుగులో దాదాపు అందరు పెద్ద స్టార్స్ తోనూ చేసింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఇలియానా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అక్కడ అనుకున్న స్దాయిలో నిలబడలేదు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుని తల్లి అయ్యాక గతాన్ని నెమరేసుకుంటోంది. మంచి ,చెడులు విశ్లేషించుకుంటోంది.
ఈ క్రమంలో ఇలియానాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలియానా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ..తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు గురించి చెప్పుకొచ్చింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది నేనూ లైంగిక వేధింపులకు గురి అయ్యాను.అందులో కొంత మంది తెలుగు దర్శకులు కూడా ఉన్నారు. ఓ డైరెక్టర్ కోరిక తీర్చమని పట్టుపడుతూంటే నేను ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను. అయితే ఫ్యామిలీ గుర్తుకు వచ్చి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని విరమించుకున్నానని ఇలియానా వెల్లడించింది.
అలాగే ఎవరో మూర్ఖుడు గురించి నేను ఎందుకు చనిపోవాలని అనుకున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇలియానా ఆ డైరెక్టర్ పేరు మాత్రం బయట పెట్టలేదు. ఇలియానా మాటలు విన్నా ఆమె అభిమానులు ఇంతకీ ఇలియానాని లైంగికంగా ఇబ్బంది పెట్టిన ఆ తెలుగు డైరెక్టర్ ఎవరూ అని కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఇలియానా తెలుగులో చివరగా కనిపించి చాలా కాలమే అవుతోంది. అమర్ అక్బర్ ఆంటోని చివరి చిత్రం. అల్లు అర్జున్ తో చేసిన జులాయ్ తరువాత అసలు ఇలియానాకు హిట్టు అన్నదే రాలేదు. కిక్ 2 కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. రవితేజతో చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, కిక్ 2, అమర్ అక్బర్ ఆంటోని ఇలా అన్నీ డిజాస్టర్లు అయ్యాయి. ఒక్క కిక్ మాత్రమే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో వచ్చాక ఏమైనా హిట్ వచ్చిందా? అంటే అది లేదు. దాంతో గత కొంతకాలంగా ఖాళీగా ఉంటోంది ఇలియానా.
ఇప్పుడు తనకు స్టార్ డం తెచ్చిన తెలుగు పరిశ్రమ మీదే అమ్మడు ఆశలు పెట్టుకుంది. తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా ట్రై చేస్తుంది ఇలియానా. మొన్నటిదాకా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని అలరించిన అమ్మడు ఇప్పుడు అదే క్రేజ్ తో సినిమా ఛాన్సులు అందుకోవాలని చూస్తోంది.