హైదరాబాద్ లో ఇళయరాజా లైవ్ కన్సర్ట్ తొలిసారిగా హైదరాబాద్ లో ప్రదర్శన ఇవ్వనున్న మ్యూజిక్ మేస్ట్రో గచ్చిబౌలి స్టేడియంలో నవంబర్ 5న ఇళయరాజా ప్రదర్శన
లెజండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా నవంబరు 5న గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియంలో సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇళయరాజా 6 వేల పాటలకుపైగా స్వర రచన చేశారు. వెయ్యికిపైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన భాగ్యనగరంలో ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. చిత్ర, మనో, సాధనాసర్గమ్, కార్తిక్ తదితర ప్రముఖ గాయనీగాయకులు ఈ వేడుకలో ప్రదర్శన ఇవ్వనున్నారు. తాజ్‌బంజారాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో నిర్వాహక సంస్థ ఈ కార్యక్రమ వివరాలు వెల్లడించింది.
ఈ సమావేశంలో ఇళయరాజా కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో గతంలో తానెప్పుడూ ప్రదర్శన ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
