సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ప్రభాస్‌  సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రాన్ని ఇప్పుడు చేసి ఉంటే `బాహుబలి` కంటే పెద్ద విజయాన్ని సాధించేదని పేర్కొన్నారు. 

రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) సోషల్‌ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఆయన ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ, సినీ పరిణామాలపై తరచూ స్పందిస్తుంటారు. తనదైన స్టయిల్‌లో సెటైర్లు పేలుస్తుంటారు. తాజాగా RGV వరుసగా ప్రభాస్‌(Prabhas) సినిమాలపై స్పందిస్తున్నారు. ఆదివారం(అక్టోబర్‌ 23)న ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాలను రీ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. బర్త్ డే సందర్భంగా `బిల్లా`(Billa) చిత్రాన్ని రీ రిలీజ్‌ చేశారు. 

`బిల్లా` సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై వర్మ స్పందించి ఇది ప్రభాస్ అభిమానుల పిచ్చి చర్యగా వర్ణించారు. మరో ఫోటోని షేర్‌ చేస్తూ ప్రభాస్‌ అభిమానులు దీపావళి జరుపుకునే దీపావళి స్టయిల్‌ అని తెలిపారు. తాజాగా మరోసారి రియాక్ట్ అయ్యారు ఆర్జీవీ. ప్రభాస్‌ నటించిన డిజాస్టర్‌ మూవీపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ప్రభాస్‌ నుంచి వచ్చిన `రాధేశ్యామ్‌`(Radheshyam) చిత్రం పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఇది డిజాస్టర్‌ గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు రీరిలీజ్‌ చేసి ఉంటే `బాహుబలి` (Bahubali) కంటే పెద్ద హిట్‌ అయ్యేదని పేర్కొన్నారు. `బాహుబలి` రికార్డులను ఇది బ్రేక్‌ చేసేదని తనదైన స్టయిల్‌లో సెటైరికల్‌గా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆయన దీపావళి శుభాకాంక్షలు చెప్పడం విశేషం. దీంతో ఇప్పుడు ఆయన ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. అరే ఆ ఆలోచనే తట్టలేదే అని అభిమానులు సెటైరికల్‌ కామెంట్లు పెడుతుండటం విశేషం. 

Scroll to load tweet…

ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన `రెబల్‌`, `బిల్లా` చిత్రాలను రీ రిలీజ్‌ చేశారు. నెక్ట్స్ `వర్షం` చిత్రాన్ని రీ రిలీజ్‌చేయబోతున్నారు. థియేటర్ల సమస్య కారణంగా ఈ చిత్రాన్ని నవంబర్‌ 11న విడుదల చేయబోతున్నారు. ఇక `బాహుబలి` ఇండియన్‌ సినిమాల్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. దాన్ని ఇంకా ఏ సినిమా బ్రేక్‌ చేయలేకపోయింది.