ఈ వారం బిగ్ షో ఏమంత ఆసక్తిగా సాగలేదు. బిగ్ బాస్ టాస్క్ లు ప్రేక్షకులకు విసుగు పుట్టించాయి. ఇక ఈ వారానికి గాను ఆరుగురు ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. మోనాల్, ఆరియానా, అవినాష్, దివి, అభిజిత్  మరియు నోయల్ నామినేట్ కావడం జరిగింది. ఇక ఈ ఆరుగురు కంటెస్టెంట్స్ లో అతి తక్కువ ఓట్లు పొందిన వారు ఎలిమినేట్ కానున్నారు. 

ఆరుగురు కంటెస్టెంట్స్ లో మోనాల్ ఎలిమినేటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న మాట వినిపిస్తుంది. ఆమెపై ఇప్పటికే బిగ్ బాస్ ప్రేక్షకులలో వ్యతిరేకత ఏర్పడింది అనేది టాక్. వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలలో కూడా మోనాల్ ఎలిమినేట్ కానున్నట్లు ఫలితాలు వచ్చాయి. కాబట్టి ఈ వారం హౌస్ నుండి మోనాల్ బయటికి రానుందని గట్టిగా వినిపిస్తుంది. 

గత వారమే మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. ఆ రోజు కుమార్ సాయి ఎలిమినేట్ కాగా,  మోనాల్ సేవ్ అయ్యింది. కుమార్ సాయి ఎలిమినేషన్ పై బిగ్ బాస్ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారని సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. 

బలమైన ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా మోనాల్ ఇంటి నుండి బయటికి రానుందట. అంచనాల ప్రకారం మోనాల్ ఎలిమినేటైన పక్షంలో దానికి కారణం అఖిల్ అని చెప్పాలి. ఎలిమినేషన్స్ కోసం జరిగిన టాస్క్ లో మోనాల్ ని నామినేట్ చేసి అఖిల్ సేవ్ అయ్యాడు. మోనాల్ ని ఎంతో ప్రేమించే వాడిగా చెప్పుకుంటున్న అఖిల్ కీలకమైన నామినేషన్స్ ప్రక్రియలో మోనాల్ కి హ్యాండ్ ఇచ్చి తను సేవ్ అయ్యాడు. గత వారం దాదాపు ఎలిమినేటైన మోనాల్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న అఖిల్ కేవలం నటించినట్లే అనుకోవాలి.