‘జవాన్’లో ఆ పాత్రకే బన్నీని అడిగారు..చేసుంటే ఎలా ఉండేదంటే..
యాక్షన్ ప్యాక్డ్ జవాన్ మూవీలో షారుక్ తోపాటు విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. థియేటర్లు షారుక్ ఫ్యాన్స్ హంగామాతో మార్మోగిపోతున్నాయి.ఇలాంటి సినిమాలో అల్లు అర్జున్ ఉంటే..

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh khan)తాజా చిత్రం జవాన్ ...గురు వారం రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ దుమ్ములేపుతూ షాక్ ఇస్తున్నాయి. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో థియేటర్స్ దగ్గర షారుఖ్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా చేయటం లేదు. ఈ క్రమంలో ఈ సినిమా చూసిన చాలా మంది...ఇంతకీ ఈ సినిమాలో అల్లు అర్జున్ ని అడిగారు అన్నారు..ఏ పాత్రకు అడిగి ఉంటారనే డిస్కషన్ మొదలైంది.
అందుతున్న సమాచారం మేరకు జవాన్ లో చివరిలో వచ్చే సంజయ్ దత్ పాత్ర కోసం దర్శకుడు అట్లీ ముందు విజయ్ తర్వాత అల్లు అర్జున్ ని సంప్రదించాడని చెన్నై వర్గాల సమాచారం. అయితే వాళ్ళు ఒప్పుకోకపోవడంతో దాన్ని సంజయ్ దత్ తో చేయించారని వినికిడి. నిజంగా అల్లు అర్జున్ ఓకే చేసి ఆ పాత్ర చేసి ఉంటే ఎలా ఉండేది అనేది చూస్తే... సినిమాకు ప్లస్ అయ్యేదేమో ..బన్ని కెరీర్ కు పెద్దగా కలిసొచ్చేదేమీ ఉండదంటున్నారు. లుంగీ కట్టుకుని బజాజ్ స్కూటర్ మీద జైలుకు వచ్చి షారుఖ్ ని పట్టుకునే పనిలో ఉండే తమిళనాడు ఆఫీసర్ పాత్రలో అల్లు అర్జున్ చేయాల్సి వచ్చేది. తెరపై సంజయ్ దత్ నిజాకి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. విజయ్ లేదా బన్నీ ఎవరు చేసినా అంతకు మించి విషయం ఏమి ఉండేది కాదు. కాబట్టి బన్ని..ఈ సినిమా చేయకపోవటమే మంచిదని ఆయన అభిమానులు అంటున్నారు.
ఇక ‘జవాన్’ చిత్రంలో షారుఖ్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో నయన్ కూడా బాలీవుడ్ లోకి తొలిసారి అడుగు పెట్టింది. ‘జవాన్’ సినిమాతో దర్శకుడు అట్లీ సైతం బాలీవుడ్ అరంగేట్రం చేసాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి కీ రోల్స్ పోషించారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె కూడా క్యామియో రోల్ లో మెరిసారు. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ‘జవాన్’ మూవీ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల అయ్యింది.
అలాగే అల్లు అర్జున్ కు ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో, దర్శకుడు అట్లీ కూడా బన్నీ పాన్ ఇండియా ఇమేజ్ ను మరింత పెంచేలా ఈ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీకి అట్లీ కథ చెప్పాడట. ఈ స్టోరీ చాలా నచ్చడంతో ఓకే చెప్పిట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.