పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమా తరువాత కుప్పులు కుప్పలుగా బాలీవుడ్ అవకాశాలు ఆయన గుమ్మం ముందు ఎదురు చూశాయి. కాని ఆయన ఒప్పుకోలేదు. ప్రస్తుతం బన్నీ బాలీవుడ్ ప్రాజెక్ట్ కు  సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.  


టాలీవుడ్ కే పరిమితం అయిన అల్లు అర్జున్.. అలవైకుంఠపురములో సినిమాతో పాటు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ సాధించాడు. ఇండియాన్ స్టార్‌గా ఎదిగాడు. ఐకాన్‌ స్టార్‌ గా పేరు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్‌. ప్రస్తుతం బన్నీ అంటే పాన్ ఇండియా పడిచచ్చిపోతోంది. ఇప్పుడు ఆయన సినిమా కోసం ఇండియన్ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల కిందట వచ్చిన పుప్ఫ మ్యానియా ఇంకా వదల్లేదు అభిమానులను. 

పుష్ప సినిమా ఇండియాన్ బాక్సాఫీస్‌ దగ్గర సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఎలాంటి ప్రమోషన్‌లు లేకుండానే హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో నార్త్‌ ఆడియెన్స్‌తో జైజైలు కొట్టించుకున్నాడు అల్లు అర్జున్. ఇక ప్రస్తుతం ఇండియా అంతటా బన్నీ పుష్ప2 కోసం ఎదరు చూస్తున్నారు. ఆసినిమాతో అంతకు మించి అనిపించాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత బన్నీ, త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే చాన్స్‌ ఉంది.

ఇక తాజాగా అల్లుఅరున్ కు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ ఓ బాలీవుడ్‌ డైరెక్టర్ సినిమా ప్రపోజల్ కు నో చెప్పాడట. నాలుగేళ్ల కిందట వచ్చిన ఉరి: ది సర్జికల్‌ స్ట్రయిక్‌ సినిమాతో దేశమంతటిని తనవైపు తిప్పుకునేలా చేశాడు దర్శకుడు ఆదిత్య ధార్‌. ఉరి సినిమా అంతా ఒక్కసారిగా ఆయన వైపు చూశారు. అయితే ఆదర్శకుడు..ఉరి తరువాత మరో సినిమా చేయలేదు. తనకు స్టార్‌ డైరెక్టర్‌ ట్యాగ్ తెచ్చిపెట్టిన విక్కీ కౌశల్‌తోనే మరో సినిమాను ప్లాన్‌ చేశాడు. దానికి ది ఇమ్మోర్టల్‌ అశ్వథ్థామ అనే పేరును కూడా ఫిక్స్‌ చేసి ప్రీలుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశాడు. కారణం ఏంటో తెలియదు కానీ విక్కీ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.

 అయితే ఈసినిమా కోసం మరో బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ను కూడా అడిగారట.. కాని ఆయన దానికి సరిగా స్పందించలేదని తెలుస్తోంది. అయితే వెంటనే ఆ దర్శకుడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను కూడా ఈ సినిమా విషయంలో సంప్రదించినట్లు తెలుస్తుంది. బన్నీకి కథ బాగా నచ్చిందట. కానీ సినిమా చేయడానికి వెనకా ముందు ఆలోచిస్తున్నాడట. పుష్ప సినిమాలో రగ్గుడ్‌ లుక్‌లో చూసిన జనాలకు.. అశ్వథ్థామ అనే మైథలాజిలక్ క్యారెక్టర్ లో తనను తీసుకుంటారా అని ఆలోచిస్తున్నాడట బన్నీ. ఒక వేళ ధైర్యం చేసినా.. అది తేడా కొడితే.. బాలీవుడ్ లో ఇమేజ్ పోతుందేమో అని భయపడుతున్నాడట బన్నీ. మరి ఇది ఎంత వరకూ నిజమో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.