Asianet News TeluguAsianet News Telugu

జాపాన్ వెళ్ళబోతున్న అల్లు అర్జున్..? పుష్పరాజ్ భారీ యాక్షన్ సీక్వెన్స్ కు అంతా రెడీ..?

భారీ యాక్షన్ సీక్వెన్స్ కు రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. అది కూడా ఫారెన్ షెడ్యూల్ కోసం బట్టలు సర్ధుకుంటున్నాడు. మరి బన్నీ ఫారెన్ షెడ్యూల్ సంగతేంటంటే..? 

Icon Star Allu Arjun Ready to Japan for Pushpa 2 Action Sequences JMS
Author
First Published Jan 24, 2024, 5:19 PM IST


టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా  పుష్ప2. గతంలో రిలీజ్ అయ్యి  సంచలన విజయాన్ని నమోదు చేసింది పుష్పమూవీ. ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది పుష్ప2. పుప్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో  అల్లు అర్జున్ కి మస్త్ క్రేజ్ ను తీసుకువచ్చింది. ప్రతీ ఇండస్ట్రీలో ఆయనకు భారీగా ఫ్యాన్స్ తయారయ్యారు. స

ప్రపంచ వ్యాప్తంగా బన్నీ వీడియోలు రీల్స్ గా చేశారు. ఎంతో మంది స్టార్స్ సోషల్ మీడియాలో బన్నీని ఇమిటేట్ చేశారు. దాంతో అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ గా మారాడు. ఇక అంతకు మించి ఉండేలా.. ఆస్కార్ సాధించేలా... పుష్ప2ను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు పుష్పుటీమ్.  పాన్ ఇండియా ఇమేజ్ నుమించి సాధించేలా పుష్ప 2' సినిమాను  భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. 

దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తుండగా.. ఈసినిమాకు  దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పిటికే పుష్ప సినిమాతో మొట్ట మొదటి సారి టాలీవుడ్ కు బెస్ట్ హీరో క్యాటగిరీలో అల్లు అర్జున్ జాతీయ అవార్డ్ సాధించి చరిత్ర సృష్టించాడు.. ఇక దేవిశ్రీకి ఈసినిమాతో బెస్ట్ మ్యూజిక్ లో జాతీయ అవార్డ్ వచ్చింది. 
  
ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశం నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నారు. 'పుష్ప' సినిమాలో యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఇక్కడే షూట్ చేశారు. అయితే 'పుష్ప 2' సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ సీన్ ను జపాన్ లో షూట్ చేయబోతున్నారు. దీని కోసం ఇప్పటికే భారీగా   సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా సమాచారం. 

కథ ప్రకారమే.. పుష్పరాజ్  ఒక భారీ డీల్ కోసం జపాన్ వెళతాడు. అక్కడ మాఫియా డాన్ తో డీల్ కుదరకపోగా, సీన్ రివర్స్ అవుతుంది. అక్కడి నుంచి పుష్ప బయటపడటమే కష్టమవుతుంది. ఈ సందర్భంలో .. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన విలన్ గ్యాంగ్ తో బన్నీ తలపడే ఒక యాక్షన్ ఎపిసోడ్ ను సుకుమార్  రాసుకున్నాడట. 

ఈ విధంగా  డిజైన్ చేశిన ఫైట్ ను ఇక్కడ ఇండియాలో చేస్తే ఏం కిక్కుంటుంది. అందుకే  ఈ యాక్షన్ సీన్ హైలైట్ గా నిలవడం కోసం జపాన్ ప్రయాణం అవుతున్నారని సమాచారం. ఇక ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ అవ్వబోతుందని అంటున్నారు. ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి.. చాలా జాగ్రత్తగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి.. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో  ఆగస్టు 15న  రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios