Asianet News TeluguAsianet News Telugu

ఆ 100 రూపాయలు జాగ్రత్తగా దాచుకున్న అల్లు అర్జున్, కారణం ఇదే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ వందరూపాయలు చాలా జాగ్రత్తగా దాచుకున్నాడట. కోట్లు సంపాదించే బన్నీ ఆ 100 ఎందుకు దాచుకున్నాడో తెలుసా..? 
 

Icon Star Allu Arjun hid it carefully 100 Rupees Given By Director Raghavendra Rao JMS
Author
First Published Jan 4, 2024, 2:13 PM IST


గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చినా.. తన సొంత టాలెంట్ తో ఎదిగాడు. డాన్స్, యాక్టింగ్, కామెడీ టైమింగ్.. హ్యాండ్సమ్ గా ఉండే అల్లుఅర్జున్.. తనను తాను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చాడు. కెరీర్ బిగినింగ్ లో ఉన్నబన్నీకి.. ఇప్పుడు ఉన్న బన్నీకి ఏమాత్రం పోలిక లేదు. అంతలా మారిపోయాడు ఐకాన్ స్టార్. అంతే కాదు బాలీవుడ్ విమర్షను స్వీకరించి.. టాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన హీరోగా సంచలనం సృష్టించాడు అల్లు అర్జున్. అంతే కాదు.. టాలీవుడ్ కు ఇప్పటి వరకూ బెస్ట్ హీరో క్యాటగిరీలో జాతీయ అవార్డ్ రాలేదు. కాని అల్లు అర్జున్ పుష్ప సినిమాతో టాలీవుడ్ కు ఆ అవార్డ్ నడిచి వచ్చేలా చేశాడు. ఇలా ఎన్నో అద్భుతాలు చేసిన బన్నీ గురించి ఓన్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

అల్లు అర్జున్ ఓ వంద రూపాయలు చాలా జాగ్రత్తగా దాచుకున్నాడట. అదేంటి.. వందల కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరో.. 100 రూపాయాలు దాచుకోవడం ఏంటీ.. అని ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఈ విషయం స్యయంగా అల్లు అర్జున్ తల్లిగారు.. స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావుతో చెప్పారట. ఇంతకీ విషయం ఏంటీ అంటే.. ఎందరో హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో పాటు.. స్టార్ హీరోలుగా మార్చిన ఘనత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుది. ఆయన హీరోలుగా తీర్చిదిద్దిన వారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. 

రాఘవేంద్రరావు తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి భారీ విజజయాలు వెనకేసుకుంటూ వచ్చారు. అంతే కాదు ఆయన కెరీర్ లో ఎంతో మంది హీరోలను పరిచయం చేశారు. 'కలియుగ పాండవులు సినిమాతో వెంకటేశ్ ను ..  రాజకుమారుడు' సినిమాతో సూపర్ స్టార్  మహేశ్ బాబును .. గంగోత్రి సినిమాతో  అల్లు అర్జున్ ను పరిచయం చేశారు దర్శకేంద్రుడు. ఇక ఆయన ఓ సందర్భంలో ఇచ్చిన వందరూపాయలనే బన్నీ చాలా ఇష్టంగా దాచుకున్నాడ. 

Icon Star Allu Arjun hid it carefully 100 Rupees Given By Director Raghavendra Rao JMS

బన్నీ డాన్స్.. యాక్టింగ్ చూసి ముగ్ధుడైన రాఘవేంద్ర రావు.. వెంటనే నా సినిమాలో నువ్వే హీరో అని వెంటనే.. అడ్వాన్స్ కింద ఓ 100 ఇచ్చాడట. ఆ వందను బన్నీ ఇప్పటికీ అపూరుపంగా దాచుకన్నాడట. ఇక ఇంట్వలో రాఘవేంద్ర రావు ఏమన్నారంటే.. ఏఎన్నార్ డాన్సులను అందరూ ఎంజాయ్ చేసేవారు. కానీ పిల్లలు డాన్సులు చేయడమనేది .. చిరంజీవి డాన్సులను చూసిన తరువాతనే మొదలైంది. పిల్లలపై చిరంజీవి అలాంటి ప్రభావాన్ని చూపించారు. ఒకసారి చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ సందర్భంగా నేను వెళ్లడం జరిగింది. అక్కడ వాళ్ల ఫ్యామిలీలో పిల్లలంతా డాన్సులు చేశారు.  

అందరిలో బన్నీ చాలా బాగా చేశాడు. నాకు చాలా ముచ్చటగా అనిపించి, 'వీడు పెద్దయిన తరువాత పెద్ద స్టార్ అవుతాడు అని చెప్పి 100 రూపాయలు ఇచ్చాను. ఆ విషయం నేను మరిచిపోయాను. ఇటీవల బన్నీ వాళ్ల అమ్మగారు నాకు ఆ విషయం గుర్తు చేశారు. బన్నీ ఆ 100 రూపాయలు అలాగే దాచుకున్నాడని చెప్పారు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios