Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ కి గాయం..బ్యాండేజ్ కట్టుకున్న బన్నీ ఫోటోలు వైరల్ .

ప్రస్తుతం పుష్ప2 మూవీ షూటింగ్ బిజీలో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈక్రమంలో ఆయన ఈ షూటింగ్ లో గాయపడ్డాడా అన్న అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

Icon Star Allu Arjun Hand Injured Photo viral In Social Media JMS
Author
First Published Feb 10, 2024, 4:19 PM IST | Last Updated Feb 10, 2024, 4:19 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2  సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ఐకాన్ స్టార్.. పుష్ప2 ను అంతకు మించి సాధించాలని పట్టుదలతో ఉన్నాడు.  అందుకోసం పుష్ప2 లో అనేక ప్రయోగాలు చేస్తున్నారు సుకుమర్, బన్నీ. ఈసినిమా కోసం ఎంత రిస్క్ చేయడానికైనా బన్నీ వెనకాడటంలేదు. ఈక్రమంలో ప్రమాదాలు కూడా లెక్క చేయడం లేదు. తాజాగా ఈసినిమా షూటింగ్ కు సబంధించి. బన్నీకి సబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. 

రీసెంట్ గా బన్నీ గాయపడ్డాని తెలుస్తోంది.  అల్లు అర్జున్ చేతికి బ్యాండేజ్ తో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన చేతికి ఏమైంది? గాయమైందా? అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అల్లు అర్జున్ చేతికి దెబ్బ తగలడం నిజమేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. పుష్ప2 కోసం  కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఎడమ చేతికి తేలికపాటి గాయమైందని తెలుస్తోంది. 

Icon Star Allu Arjun Hand Injured Photo viral In Social Media JMS

అయితే దాంతో ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చినట్టు సమాచారం. బ్రేక్ లో కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాని. .. సినిమాకు సబంధించిన డిస్కార్షన్స్ ను బన్నీ కట్టుతోనే చేస్తున్నట్టు సమాచారం. డాక్టర్లు మాత్రం  రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని గట్టిగా చెప్పారట బన్నీకి.  అల్లు అర్జున్... గాయం నయం అయ్యాక మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నట్టు సమాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios