Asianet News TeluguAsianet News Telugu

IC 814 కాందహార్ హైజాక్ : ఇస్లామిక్ టెర్రరిస్టులకు హిందూ పేర్లపై దుమారం

ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ప్లిక్స్ లో వచ్చిన IC 814 కాందహార్ హైజాక్  వెబ్ సీరిస్ పై  దుమారం రేగింది. ఆ సినిమాలో టెర్రరిస్టులను చూపించిన విదానంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

IC 814 Kandahar Hijack Controversy: Bollywood Faces Backlash Over Use of Hindu Names for Terrorists AKP
Author
First Published Sep 5, 2024, 8:32 PM IST | Last Updated Sep 5, 2024, 8:34 PM IST

బాలీవుడ్ సినిమాలు హిందువులను, హిందూదేవుళ్ళను కించపర్చేలా వుంటాయనే అపవాదు వుంది. దేశంలోని ఇతర ఏ పరిశ్రమలో లేనంతలా హిందువులపై వివక్ష బాలీవుడ్ లో వుంటుందనేది ఇప్పటికే ప్రచారంలో వుంది. ఈ క్రమంలో తాజాగా మరో బాలీవుడ్ డైరెక్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లెవుతున్నాయి. 

బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా 'ది కాందహార్ హైజాక్' పేరుతో వెబ్ సీరిస్ రూపొందించారు. ఇది ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. అయితే ఇందులో ఉగ్రవాదులను హిందువులుగా చూపించారంటూ... హిందూ పేర్లను వాడారంటూ దుమారం రేగుతోంది. వివాదం చెలరేగడంతో వెబ్ సీరీస్ లో మార్పులు చేపట్టారు. 

బాలీవుడ్ లో హిందువులు పవిత్రంగా భావించే పాత్రలను, చిహ్నాలను కించపర్చేలా చూపిస్తారనే ఆరోపణలు వున్నాయి. పికే, ఓ మై గాడ్ వంటి సినిమాల్లో హిందూ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలను కించపర్చారంటూ హిందూ మత సంఘాలు మండిపడ్డాయి. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించినా బాలీవుడ్ డైరెక్టర్ల తీరు మారడంలేదని...మళ్లీ IC814 కాందహార్ హైజాక్ లో అలాగే చేసారని మండిపడుతున్నారు.హైజాకర్లు ఇస్లామిక్ టెర్రరిస్టులు అయినప్పటికి హిందూ పేర్లను వాడారంటూ మండిపడుతున్నారు.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios