Asianet News TeluguAsianet News Telugu

నటుడిగా సత్తా చాటుతున్న IAS ఆఫీసర్‌

గతంలో విమర్శకుల ప్రశంసలు పొందిన షార్ట్ ఫిలిం `చార్ పండ్రా`లో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న అభిషేక్ సింగ్ ఈ పాటలో రొమాంటిక్ సైడ్ ని చూపించి ఆకట్టుకున్నాడు. ఈ పాట విడుదలైన దగ్గర నుంచి అభిషేక్‌ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ ప్రశంసలతో మోత మోగిపోతున్నాయి.

IAS Officer Abhishek Singh Dil Tod Ke breaks the internet
Author
Hyderabad, First Published Jul 24, 2020, 4:33 PM IST

ప్రముఖ కళాకారుడు బి ప్రాక్‌ పాడిన తాజా రొమాంటిక్‌ నంబర్‌ దిల్‌ టాడ్‌ కే సాంగ్ రికార్డ్‌లు బద్దలు గొడుతోంది. ఈ పాటలోని సంగీతం, సాహిత్యం ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సాంగ్ వీడియో కేవలం 4 రోజుల్లోనే 25 మిలియన్ల (2. 5 కోట్ల) వ్యూస్‌ సాధించి రికార్డ్ సృష్టించింది. అయితే ఈ విషయంలో మేజర్‌ క్రెడిట్‌ సాంగ్‌లో నటించి అభిషేక్‌ సింగ్‌దే అంటున్నారు మేకర్స్.  అభిషేక్‌ ఐఏఎస్‌ అధికారి కూడా కావటం విశేషం. నటుడిగా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన అభిషేక్ కోసమే ఈ పాటను పదే పదే చూస్తున్నారు.

గతంలో విమర్శకుల ప్రశంసలు పొందిన షార్ట్ ఫిలిం `చార్ పండ్రా`లో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న అభిషేక్ సింగ్ ఈ పాటలో రొమాంటిక్ సైడ్ ని చూపించి ఆకట్టుకున్నాడు. ఈ పాట విడుదలైన దగ్గర నుంచి అభిషేక్‌ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ ప్రశంసలతో మోత మోగిపోతున్నాయి. ఎమోషనల్ సీన్స్‌లో అభిషేక్‌ నటన వావ్‌ అనిపించేలా ఉందంటున్నారు ప్రేక్షకులు. ఓ ఐఏఎస్ అధికారి నటుడిగా ఈ స్థాయిలో టాలెంట్‌ చూపించటంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇప్పటికే దిల్ టాడ్‌ కే సాంగ్‌తో పాటు పలు షార్ట్ ఫిలింస్‌లో అద్భుతమైన నటన కనబర్చిన అభిషేక్‌ సింగ్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో రాబోయే ఢిల్లీ క్రైమ్‌ 2 సిరీస్‌లో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సిరీస్‌లో అభిషేక్ కీలక పాత్రలో నటింస్తున్నట్టుగా తెలుస్తోంది. అభిమానులు కూడా అభిషేక్‌ను పూర్తి స్థాయి నటుడిగా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios