పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’ హిట్ చిత్రంగా నిలిచింది. సినిమా సక్సెస్ ను డైరెక్టర్ సాగర్ కే చంద్ర ఎంజాయ్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ కోసం పడ్డ కష్టం.. తన నెక్ట్స్ మూవీపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.   

ఇఫ్పుడంతా ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) హవానే కొనసాగుతోంది. థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. ఫిబ్రవరి 25న రిలీజైన ఈ మూవీ కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. మొత్తంగా సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో హిట్ చిత్రంగా నిలిచింది. దీంతో చిత్రం యూనిట్ కూడా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేశారు. చిత్రం మంచి విజయవంతమవడంతో దర్శకుడు చాలా సంతోషయం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ ఎంతలా కష్టపడ్డారో వివరించారు. తన నెక్ట్స్ మూవీ ఎవరితో చేయబోతున్నారో కూడా వెల్లడించారు.

టాలీవుడ్ లో నా తొలిసినిమా‘అయ్యారే’కి దర్శకత్వం వహించినప్పుడు కేవలం సినిమా తీయాలనే తపన తప్ప నాకు ఇంకేం తెలీదు. ఆ తర్వాత తీసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’కి మంచి పరిచయాలు పెరిగాయి. గతంతో పోల్చితే డైరెక్షన్స్ లోనూ మరిన్న మెళకువలు తెలుసుకున్నాను. ఈ సినిమా నన్ను ఒక అడుగు ముందుకెళ్లేలా చేసింది. ఆ తర్వాత నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ద్వారా ‘భీమ్లా నాయక్‌’ మూవీ చేసే అవకాశం వచ్చింది. ఈ మూవీతోనే ఫేమ్ కూడా వచ్చింది. అయితే ‘అయ్యప్పన్ కోషియమ్’కు రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కిన విషయం తెలిసిందే. కోషి పాత్రను భీమ్లాగా మార్చేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ఇచ్చిన సలహాలు, సూచనలు నన్ను మరో కోణంలో ఆలోచింపజేశాయి. మొత్తంగా ఈ సినిమాకు పనిచేయడం ద్వారా మరిన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారు. 

నా తర్వాతి సినిమాను మాత్రం రీమేక్ చేయను. స్ట్రేట్ మూవీ చేయాలని ఉంది. అసలు భీమ్లా నాయక్ మూవీకంటే ముందే నేను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (varun Tej)తో మూవీ చేయాల్సింది. 14రీల్స్ ప్లస్ బ్యానర్ లో ఓ సినిమా ప్రకటించారు. కానీ బడ్జెట్‌ అనుకున్నదానికంటే ఎక్కువ అవడంతో అక్కడే ఆగిపోయింది. ప్రస్తుతం మళ్లీ అదే సినిమాపై వర్క్ చేయాలనుకుంటున్నా.. కానీ అప్పటి కథనే ఎంచుకుంటానా.. లేక మరో కొత్త కథతో వర్క్ చేయాల్సి ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేను. ఏదేమైనా భీమ్లా నాయక్ మూవీ నన్ను నన్ను మరో మెట్టు ఎక్కించింది. తర్వలో హిందీలోనూ రిలీజ్ కానుంది. పవన్‌ కల్యాణ్, రానాతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది.
మరోవైపు బ్లాక్ బస్టర్ టాక్ తో ‘భీమ్లా నాయక్’ మూవీ దూసుకెళ్తుండడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ పట్ల చాలా ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన ‘భీమ్లా నాయక్’ టీంకు స్పెషల్ ట్రీట్ ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ‘భీమ్లా నాయక్’ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల నుండి యూఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. ఈ చిత్రానికి వీకెండ్ మూడు రోజులు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే వరకు వరల్డ్ వైడ్ గా 69.19కోట్లు(108.50కోట్లు~ Gross) సాధించింది. ఇందులో ఆంధ్రా, తెలంగాణా మొత్తం: 53.07కోట్లు(79.10కోట్లు~ Gross) సాధించి భీమ్లా హవాను కొనసాగిస్తున్నాడు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటించారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించి మెప్పించారు.