ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు దర్శకుడు అనిల్ రావిపూడి. మిగతా దర్శకుల మాదిరి కాకుండా గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం అనిల్ రావిపూడి శైలి. సరిలేరు నీకెవ్వరు విడుదలైన ఏడాది లోపే ఎఫ్ 3 మూవీని లైన్ లో పెట్టాడు ఆయన. 

కాగా అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మరియు హీరోలపై హింట్ ఇచ్చాడు. చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్స్, చేయాలనుకుంటున్న చిత్రాల వివరాలు వెల్లడించాడు. ముందుగా బాలయ్యతో మూవీ చేసే ఆలోచన ఉందని, దీని గురించి చర్చలు కూడా జరిగాయని అనిల్ అన్నారు. అలాగే ఓ కథను మహేష్ కి వినిపించగా.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. 


వీటితో పాటు హీరో రామ్ తో కూడా ఓ మూవీ చేసే ఆలోచనలో ఉన్నానని అని తెలియజేశారు. అలాగే ఓ స్పోర్ట్స్ డ్రామాను.. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కించాలని ఆయన అనుకుంటున్నారట.  ఎఫ్ 3 తరువాత ఆయన చెప్పిన ఈ నాలుగు ప్రాజెక్ట్స్ లో ఒకటి ఉండే అవకాశం కలదు. ప్రస్తుతం వెంకీ, వరుణ్ లతో ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. ఎఫ్ 3 లో డబ్బుల కోసం హీరోలు పడే ఫ్రస్ట్రేషన్ చూపిస్తాం