'కృష్ణంవందే జగద్గురుం','ఖైదీ నెంబర్ 15౦','గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి చిత్రాలను మాటలు అందించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు రచయిత సాయి మాధవ్ బుర్రా. ఇటీవల విడుదలైన 'మహానటి' చిత్రానికి కూడా ఆయన సంభాషణలు అందించారు. అయితే సాయి మాధవ్ బుర్రా పచ్చి తాగుబోతని, తరచూ మద్యం సేవించడం వలన అతడి ఆరోగ్యం కూడా పాడైందని రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వీటిపై స్పందించిన ఆయన.. 'అవును నేను తాగుతాను.. కానీ అందరూ అనుకుంటున్నట్లు రోజులో 24 గంటలు తాగను. రాత్రి 8 తరువాత మాత్రం కొంత ఆల్కహాల్ తీసుకుంటాను. అది కూడా ఆరోగ్యం పాడుచేసుకునేంతగా ఏం తాగనని స్పష్టం చేశారు'.

ప్రస్తుతం సాయి మాధవ్ బుర్రా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై.. రా' సినిమాకు మాటలు రాస్తున్నారు. అలానే మోహన్ బాబు నటించనున్న 'కన్నప్ప' సినిమాకు కూడా రైటర్ గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ రైటర్.. డైరెక్టర్ గా పరిచయం కానున్నాడని టాక్.