యానిమల్ లో నేనైతే నటించను... రష్మికకు తాప్సీ చురకలు!
కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ జీరో హౌర్ లో యానిమల్ కంటెంట్ చాలా అభ్యంతరకరంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు నటులు, చిత్ర ప్రముఖులు సైతం యానిమల్ కి వ్యతిరేకంగా గళం వినిపించారు. ఈ లిస్ట్ లో తాజాగా హీరోయిన్ తాప్సీ చేరింది.
యానిమల్ మూవీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. వరల్డ్ వైడ్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించగా రన్బీర్ కపూర్ హీరోగా నటించారు. రష్మిక మందాన హీరోయిన్. ఈ మూవీలో వైలెన్స్, న్యూడిటీ, ఫౌల్ లాంగ్వేజ్ మోతాదుకు మించి ఉన్నాయి. వీటన్నింటికీ మించి పురుషాధిక్యతను ప్రోత్సహించేదిగా ఉందనే ఆరోపణలు వినిపించాయి.
పార్లమెంట్ వేదికగా యానిమల్ మూవీపై చర్చ నడిచింది. కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ జీరో హౌర్ లో యానిమల్ కంటెంట్ చాలా అభ్యంతరకరంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు నటులు, చిత్ర ప్రముఖులు సైతం యానిమల్ కి వ్యతిరేకంగా గళం వినిపించారు. ఈ లిస్ట్ లో తాజాగా హీరోయిన్ తాప్సీ చేరింది. నేనైతే యానిమల్ మూవీలో నటించను అని పరోక్షంగా రష్మిక మందానకు చురకలు వేసింది.
ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. సినిమా నటులకు ఒక పవర్ ఉంటుంది. అదే సమయంలో బాధ్యత కూడా ఉంటుంది. అలా అని యానిమల్ వంటి చిత్రాల్లో నటించేవాళ్ళను నేను తప్పుబట్టడం లేదు. మనం ప్రజాస్వామిక దేశంలో పుట్టాము. నచ్చింది చేసే స్వేచ్ఛ మనకు ఉన్నాయి. నేనైతే యానిమల్ మూవీలో నటించను... అని అన్నారు.
తాప్సీ కామెంట్స్ ఖచ్చితంగా రష్మిక మందానను పరోక్షంగా విమర్శించినట్లు అయ్యింది. ఇలాంటి వైలెంట్ మూవీలో రష్మిక కాబట్టి నటించింది, నేనైతే రిజెక్ట్ చేసే దానిని అని తాప్సీ చెప్పినట్లుగా ఉంది. నెట్ఫ్లిక్స్ లో యానిమల్ మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఇక తాప్సీ కొన్నాళ్లుగా హిందీలో ఎక్కువగా నటిస్తున్నారు. ఇటీవల ఆమె షారుఖ్ ఖాన్ కి జంటగా డంకీ మూవీలో నటించింది. ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు. తాప్సీ కెరీర్ సౌత్ లో ప్రారంభం కాగా.. పలు సందర్భాల్లో తెలుగు సినిమాపై ఆమె విమర్శలు చేశారు.